Amit Shah To Chandra Babu : చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ ! కేంద్ర బలగాల రక్షణ కోరిన టీడీపీ అధినేత !
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కశ్మీర్‌లో ఉన్న కారణంగా అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో చంద్రబాబు వెనక్కి వచ్చేశారు. విషయం తెలిసి అమిత్ షా ఫోన్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను వివరించి.. ఆర్టికల్ 356 విధించాలని విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాష్ట్రపతిని కలిశారు. కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేద్దామనుకున్నారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఈ కారణంగా అపాయింట్‌మెంట్ లభించలేదు. దాంతో చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు.
Also Read : ధూళిపాళ్ల ట్రస్ట్ స్వాధీనం దిశగా ప్రభుత్వం ! వారం రోజుల తర్వాత కీలక పరిణామాలు..?
చంద్రబాబునాయుడు తన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారని తెలిసిన తర్వాత అమిత్ షా ఫోన్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఫోన్‌లోనే ఏపీ పరిస్థితులను అమిత్ షా వివరించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులు.. ఆ దాడుల్లో పోలీసులు స్వయంగా పాల్గొనడం, పైగా నిందితుల్లో ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం, తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడం వంటి అంశాలను వివరించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో డ్రగ్స్, గంజాయికి కేంద్రంగా ఏపీ మారిన వైనాన్ని కూడా వివరించారు. తక్షణం ఏపీలో ఆర్టికల్ 356 విధించడానికి అనువైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని తెలిపారు.
Also Read : ఏపీ నార్కొటిక్స్ హబ్ గా మారింది.. నల్గొండ ఎస్పీ కూడా అదే చెప్పారు
ఏపీలో పోలీసులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతలే టార్గెట్‌గా పని చేస్తున్నందున కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. పరిశీలిస్తామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడంతో టీడీపీలో కాస్త నిరాశ కనిపించింది. అయితే అమిత్ షానే నేరుగా ఫోన్ చేయడంతో ఆ పార్టీ నేతలు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
Also Read : టీటీడీ బోర్డులోకి "కేతన్ దేశాయ్" ఎలా ? హైకోర్టు ఆశ్చర్యం.. నోటీసులు జారీ !
మరో వైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎవరూ ఢిల్లీలో అపాయింట్‌మెంట్లు ఇవ్వలేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీకి వచ్చింది వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికని ఆరోపించారు. తాము కూడా ఈసీని, రాష్ట్రపతిని కలిసి తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. చంద్రబాబును ఉగ్రవాది అని అనడంలో ఏ మాత్రం తప్పు లేదని విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఘాటు విమర్శలు చేశారు.
Also Read : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !