News
News
X

Minister Peddireddy On Lokesh : లోకేశ్ కు కనీస లోకజ్ఞానం లేదు, అజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్ - మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy On Lokesh : ఎనర్జీ అసిస్టెంట్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ లేఖ రాశారు. ఈ లేఖపై లోకేశ్ కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

FOLLOW US: 

Minister Peddireddy On Lokesh : ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన లేఖతో మరోసారి తన అజ్ఞానాన్ని చాటుకున్నార‌ని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. లోకేశ్ కు కనీస లోకజ్ఞానం కూడా లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు మరోసారి స్పష్టం చేశార‌ని అన్నారు. ముఖ్యమంత్రికి లేఖరాసే సందర్భంలో కనీస వాస్తవాలు తెలుసుకునే ఆలోచన కూడా లోకేశ్ కు లేదని పేర్కొన్నారు. అవివేకం, అనుభవరాహిత్యం, అజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్ లోకేశ్ అని,  సొంత పార్టీ నేతల మనసులోని మాటలకు అద్దం పట్టేలా లోకేశ్ ప్రేలాపనలు ఉన్నాయని అన్నారు. 

ఎనర్జీ అసిస్టెంట్ లకూ ఆర్ఈసీ

రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా సీఎం జగన్ పాలనలో ఒక విప్లవాత్మక మార్పులకు నాంది పలికార‌ని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. లక్షలాది మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి, యువతలో స్ఫూర్తిని నింపారన్నారు. విద్యుత్ శాఖను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సచివాలయాల పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేశారని గుర్తు చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందితో సమానంగా ఎనర్జీ అసిస్టెంట్ లకు ఆర్ఈసీ, ఎన్టీపీఐ వంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థల తోడ్పాటుతో వృత్తి నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు ఎనర్జీ అసిస్టెంట్ లకు వృత్తి నైపుణ్యాలను పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల సమయంలో ఎటువంటి శిక్షణ లేకుండా స్తంభాలను ఎక్కించి, ఎనర్జీ అసిస్టెంట్ లను ప్రమాదాల్లోకి నెడుతున్నారంటూ లోకేశ్ తన లేఖలో పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. 

లోకేశ్ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయ్ 

లోకేశ్ లేఖపై పెద్ది రెడ్డి స్పందిస్తూ ఏమ‌న్నారంటే.." సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వపరంగా వర్తించే అన్ని నిబంధనలు ఎనర్జీ అసిస్టెంట్ లకు వర్తిస్తున్నాయి. సెలవులు, ఇతర సదుపాయాలు వారికీ ఇతరులతో సమానంగానే కల్పిస్తున్నాం. సెలవులు లేకుండా పనిచేయాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ లోకేశ్ వాపోవడం విడ్డూరంగా ఉంది. సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబెషనరీ ప్రకటించాలని సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎనర్జీ అసిస్టెంట్ లకు కూడా ప్రొబెషనరీ ప్రకటించాం. ఈ విషయంలోనూ లోకేశ్ తన అవగాహన లేమిని చాటుకున్నారు. ప్రొబెషనరీకి ముందు రూ.15 వేల జీతం ఉంటే, ఆ తరువాత అది రూ.31 వేలకు పెరిగిన విషయం లోకేష్ కు తెలియకపోవడం విచారకరం. బాబు వస్తే జాబు వస్తుందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హయాంలో యువతకు మొండి చేయి చూపించారు. ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగులు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. " అని విమర్శించారు. 

అవాస్తవాలు ప్రచారం 

సీఎం జగన్ అధికారంలోకి రాగానే యువతలో విశ్వాసాన్ని కల్పిస్తూ, సచివాలయాలు, ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లు ప్రతికూల పరిస్థితుల్లోనూ రెగ్యులర్ విద్యుత్ రంగ సిబ్బందితో కలిసి తమ శక్తి మేరకు సేవలు అందిస్తున్నారని, దీనివల్లే  రాష్ట్ర విద్యుత్ సంస్థలు వినియోగదారుల సేవా సూచికలో జాతీయ స్థాయిలో ఏ గ్రేడ్ సాధించాయన్నారు. విధి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లు ప్రాణాలను కోల్పోతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భద్రతా పరికరాలను ఉపయోగించకుండా వ్యక్తిగత అశ్రద్ధ కారణంగా జరిగిన కొన్ని ప్రమాదాలను భూతద్దంలో చూపుతూ విమర్శించటం సరికాదన్నారు. ప్రమాదాలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఎనర్జీ అసిస్టెంట్లు, రెగ్యులర్ సిబ్బంది కూడా కొన్ని చోట్ల ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. అయితే వాస్తవాలను వక్రీకరిస్తూ ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను కట్టుబానిసలు, వెట్టిచారికి వంటి పదాలతో లోకేశ్  కించపరిచేలా మాట్లాడారన్నారు. 

Also Read : High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Published at : 19 Aug 2022 06:35 PM (IST) Tags: Nara Lokesh AP News Minister Peddireddy CM Jagan Energy Assistants

సంబంధిత కథనాలు

40 పెండింగ్ సమస్యలపై గళమెత్తిన ఏపీ ఉద్యోగ సంఘాలు- ప్రభుత్వానికి నెల రోజుల గడువు

40 పెండింగ్ సమస్యలపై గళమెత్తిన ఏపీ ఉద్యోగ సంఘాలు- ప్రభుత్వానికి నెల రోజుల గడువు

CM Jagan Review :పట్టణాలు, నగరాల్లో మార్చి 31 నాటికి రోడ్లు బాగుచేయాలి- సీఎం జగన్

CM Jagan Review :పట్టణాలు, నగరాల్లో మార్చి 31 నాటికి రోడ్లు బాగుచేయాలి- సీఎం జగన్

JC Prabhakar Reddy : ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మనిలాండరింగ్ ఆరోపణలపై విచారణ!

JC Prabhakar Reddy : ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మనిలాండరింగ్ ఆరోపణలపై విచారణ!

Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

Amalapuram BRS Banners : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, అమలాపురం ఎంపీ అభ్యర్థి ఆయనేనా?

Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

టాప్ స్టోరీస్

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల