By: ABP Desam | Updated at : 06 Feb 2023 05:53 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హరిరామ జోగయ్య
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు కాపు సంఘం నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య. కాపు రిజర్వేషన్లపై ఇటీవల దీక్షకు సిద్ధమైన ఆయన... పవన్ కల్యాణ్ జోక్యంతో దీక్ష విరమించారు. తాజాగా కాపు రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. ఈ పిటిషన్ పై రేపు(మంగళవారం) హైకోర్టు విచారించనుంది. కాపుల్లో వెనకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడతుందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని పిటిషన్‌లో హరిరామజోగయ్య తెలిపారు.
కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు
అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింది 5 శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గత ఏడాది డిసెంబర్ లో చేగొండి హరిరామజోగయ్య సీఎం జగన్ ను కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అలాగే 86 ఏళ్ల వయసులో ఆమరణ దీక్షకు దిగడంపై పవన్ కల్యాణ్ తో సహా, ఆయన సన్నిహితులు దీక్షపై పునరాలోచించాలని కోరారు. అనంతరం జోగయ్య దీక్ష విరమించారు. అయితే కాపు రిజర్వేషన్లపై తన ప్రాణం పోయేవరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తాజాగా ఆయన రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించారు.
చావడానికైనా సిద్ధం
కాపు రిజర్వేషన్ల సాధించడానికి తాను చావడానికైనా సిద్ధమని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య ఇప్పటికే స్పష్టం చేశారు. కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. దీంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో కాపులకు చేసిందేంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పందించని ప్రభుత్వం
ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గత ఏడాది డిసెంబర్ లో ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై గత ఏడాది డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఈ డెడ్ లైన్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆయన దీక్షకు దిగడం, దానిని పోలీసుల భగ్నం చేయడం ఆ తర్వాత జరిగిపోయాయి. మాజీ మంత్రి పేర్ని నాని హరిరామజోగయ్య డిమాండ్ కు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి జోగయ్య డిమాండ్ పై స్పష్టత రాలేదు.
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
Breaking News Live Telugu Updates: టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, శ్రీవారి భక్తుల మధ్య వాగ్వాదం - బూతులు తిట్టుకున్న ఇరువురు!
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
AP New Industrial Policy: పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కులు- కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకటించిన ఏపీ
తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?