CM Jagan : పేదలందరికీ ఇళ్లు పనులు వేగవంతం చేయండి- సీఎం జగన్ ఆదేశాలు
CM Jagan : పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.
CM Jagan : గృహ నిర్మాణ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలన్నారు. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు నిధులు కూడా సకాలంలో విడుదల చేస్తున్నామన్నారు. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలని సూచించారు. విశాఖపట్నంలో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరు చివరినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ఆప్షన్ 3 కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఫోన్ నంబర్ కూడా అందుబాటులో
ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపైన దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడ నుంచే ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రత్యేకించి ఒక ఫోన్ నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష
15–20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సిద్ధం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని సీఎం జగన్ సూచించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న సీఎం, నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం రివ్యూ. గృహనిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని, ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం. విశాఖలో ఇళ్ల నిర్మాణపనులు వేగంగా జరగాలన్న సీఎం. కాలనీల్లో డ్రైనేజీ, నీళ్లు, కరెంటు మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్న సీఎం. pic.twitter.com/EiLdiZKSzT
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 1, 2022
90 రోజుల్లో ఇంటిపట్టా
ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా ఎంపిక చేశామని అధికారులు సీఎం తెలిపారు. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామని సీఎంకు వివరించారు. మిగతావారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. అయితే పట్టా ఇవ్వడమే కాదు, లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని సీఎం సూచించారు.
Also Read : AP Floods: వరదల వేళ నేతల హామీల వర్షం - వాటిని నెరవేర్చేదెవరు ! ‘దేవుడా’ ఎవరి దారి వారిదేనా ?