అన్వేషించండి

Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!

Agri Gold Assets Auction: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నెలల్లో అందరికీ చెల్లింపులు చేయనున్నారు.

Justice For Agri Victims:  ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11 లక్షల మంది కుటుంబాలను దశాబ్ద కాలంగా పీడిస్తున్న అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనతపై మండిపడ్డ సీఎం, రాబోయే ఆరు నెలల్లోగా బాధితులందరికీ వారి సొమ్ము చెల్లించి ఈ అధ్యాయానికి ముగింపు పలకాలని అధికారులను ఆదేశించారు. ఇది కేవలం హామీ మాత్రమే కాదని, ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 19 లక్షల మంది బాధితులలో, సింహభాగం అంటే 11 లక్షల మంది ఏపీలోనే ఉన్నారు. వీరి క్లెయిమ్స్‌ను అత్యంత పారదర్శకంగా పరిశీలించడం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   అటాచ్ చేసిన రూ. 4,141 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. న్యాయపరమైన చిక్కులను తొలగించి, వివాదరహిత ఆస్తులను వెంటనే విక్రయించి నగదును సమీకరించాలని కేబినెట్ తీర్మానించింది.                       

గత వైఎస్సార్సీపీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియ నత్తనడకన సాగడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేవలం రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన దాదాపు 10.40 లక్షల మందికి మాత్రమే కొంత మేర ఊరట లభించింది. కానీ, అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసి, తమ జీవితకాల సంపాదనను కోల్పోయిన లక్షలాది మంది మధ్యతరగతి బాధితులు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ జాప్యానికి కారణమైన అధికారుల తీరును తప్పుబట్టిన సీఎం, తక్షణమే లిక్విడేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు.

రాజకీయంగా కూడా అగ్రిగోల్డ్ బాధితుల అంశం ఏపీలో అత్యంత ప్రభావితమైనది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల కోసమే వేచి చూడకుండా, అవసరమైతే ప్రభుత్వ పరంగా ముందస్తుగా కొంత నిధిని కేటాయించి బాధితులకు సర్దుబాటు చేసే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిపాజిట్ దారుల జాబితాను జిల్లా వారీగా సిద్ధం చేసి, చెల్లింపుల ప్రక్రియను డీబీటీ  ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చేలా టెక్నాలజీని వాడుకోనున్నారు.

 అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏళ్ల తరబడి కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన బాధితులకు, ఆరు నెలల గడువు అనేది ఒక పెద్ద ఊరట. ప్రభుత్వం చెప్పిన విధంగానే ఆస్తుల వేలం వేగంగా జరిగి, బాధితుల సొమ్ము వారికి చేరితే.. అది కూటమి ప్రభుత్వానికి పెద్ద రాజకీయ విజయంగా మారుతుందనడంలో సందేహం లేదు.            

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget