Madhavi Latha On Pawan: పవన్ కల్యాణ్ పై మాధవీలత సంచలన కామెంట్స్... మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు...
పవన్ కల్యాణ్ పై సినీనటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పోస్ట్ లు మతమార్పిళ్లను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా ఖాతాలు చూస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిదన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. పవన్ కల్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని, ఆయన క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్ అలానే ఉందని మాధవీలత సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
'పవన్ కల్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మినవారికి శుభాకాంక్షలు చెప్పండి మంచిది. మానవాళికి వంటి పెద్దమాటలు ఎందుకు? మీ పోస్ట్ మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. బైబిల్‌ని బోధించనక్కర్లేదు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని ఏసు చెప్పలేదు. ఆయన చెప్పారని నేనూ మొన్నటిదాకా మీలాగే నమ్మాను. మీ పేజీని మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. మొన్న మీరు కూడా బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. అంత గొప్పేంలేదు. మీరు కూడా మతమార్పిళ్లకు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు. మీ పోస్టులో విషెస్ కంటే మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను.' అని మాధవీలత తన ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. ఈ అంశంపై ఓ వీడియో కూడా పెట్టింది.
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
క్రిస్మస్ శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #HappyChristmas #Christmas pic.twitter.com/fGHUyEB4sT
— JanaSena Party (@JanaSenaParty) December 24, 2021
పవన్ క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్
జనసేనాని పవన్ కల్యాణ్ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షరు తెలిపారు. ఈ విషెన్ ను జనసేన సోషల్ మీడియా ఖాతాల్లో వివిధ భాషల్లో పోస్టులు పెట్టారు. ‘‘క్రిస్మస్ శుభాకాంక్షలు. దైవం మానుష రూపేణా.. మానవునిగా జన్మించి, మానవులను ప్రేమించి, మానవులను జాగృతపరచడానికి దివికి వచ్చిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ అవతార పురుషుని జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం. ఏసు నామమును స్మరిస్తూ, ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుణ్ణి ప్రార్ధిస్తున్నాను' అని పవన్ కల్యాణ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై సినీ నటి మాధవీలత అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.
Also Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి