అన్వేషించండి

YCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల్లో మార్పు - ఆ లీడర్ కు షాకిచ్చిన సీఎం జగన్ !

YSRCP : వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల్లో గతంలో వెల్లడించిన పేర్లలో ఓ మార్పు చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మెల్యేకు బదులుగా మేడా రఘునాథరెడ్డికి ఖరారు చేశారు.

YCP Rajya Sabha Candidates : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.  ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు. ఏ క్షణమైనాపేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకు ముందు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఖరారు చేశారు. రాయలసీమలో బలిజ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా చిత్తూరులో రెడ్డి వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ కేటాయించారు. ఈ కారణంగా ఆయనకు రాజ్యసభ ఇస్తారనుకున్నారు. కానీ చివరి క్షణంలో కడప జిల్లా రాజంపేటకు చెందిన  రఘునాథరెడ్డికి కేటాయించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.                                 

గురువారం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నందున రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం  అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉంది.  

ఎలాంటి పొరపాట్లు జరక్కుండా అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, అదే విధంగా అప్పుడు జరిగిన విధంగానే క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. విచారణకు పిలిచారు. 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు. ప్రత్యక్షంగా తమ వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనర్హతా  వేటు వేస్తే ఈసీ అంగీకరిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.                                                                 

టిక్కెట్లు దక్కని పలువురు ఎమ్మెల్యేలు .. టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎక్కువ మంది రిజర్వుడు నియోజకవర్గాల వారికి టిక్కెట్లు మారుస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ దళిత అభ్యర్థిని పోటీకి పెడితే వారంతా దళిత ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అందుకే  దళిత  నేత గొల్ల బాబూరావుకు టిక్కెట్ ఖరారు చేసి..  ఓటింగ్ లో దళిత ఎమ్మెల్యేలను ఆయనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.                     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget