అన్వేషించండి

Andhra Corona Update: ఏపీలో కొత్తగా 1,439 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా మరో 14 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1439 కేసులు నమోదయ్యాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 62,856 మంది నమూనాలు పరీక్షించారు. 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,311 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,624 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ వల్ల కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని బులెటిన్ లో వైద్యారోగ్య శాఖ తెలిపింది.

అనంతపురంలో 23, చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో 170, గుంటూరులో 142, కడపలో 66, కృష్ణాలో 131, కర్నూలులో 8, నెల్లూరులో 260, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 79, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.  

#COVIDUpdates: 09/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,23,147 పాజిటివ్ కేసు లకు గాను
*19,94,559 మంది డిశ్చార్జ్ కాగా
*13,964 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,624#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nNihF7LJZr

— ArogyaAndhra (@ArogyaAndhra) September 9, 2021 " title="" target="">

ఏపీలో కరోనా పరిస్థితులో హైకోర్టులో నిన్న వాదలను జరిగాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ ఆంక్షలను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని , మాస్కులు ధరించడం లేదని అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం జీవోలు ఇస్తున్నా .. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.

మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా వేస్తున్నామన్నారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యల పురోగతిని పరిశీలించేందకు విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ కట్టడిపై చర్యలను హైకోర్టు పర్యవేక్షిస్తూ విచారణ జరుపుతుంది. ఉపాధ్యాయులకు టీకా పూర్తికాకుండానే.. 50 % మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే టీకాలు పూర్తి అయ్యాయని అమికస్ క్యూరీ వాదనలు వినిపించారు. మొత్తం ఉపాధ్యాయులకు పూర్తి కాకుండానే బడులు తెరిచారన్నారు. తర్వాత కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

Also Read: LoKesh Today : రోజంతా లోకేష్ టూర్ హైవోల్టేజ్ టెన్షన్ ! చివరికి ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులిచ్చిన పోలీసులు !

Also Read: RRR Vs YSRCP : ఓదార్పు హక్కు జగన్‌కే ఉంటుందా.. లోకేష్‌ అడ్డగింతపై ఎంపీ విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Vizag Fishermen Rescue Operation: వైజాగ్‌ మత్య్సకారుల కోసం చేపట్టిన ​రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకం! ఆందోళనలో కుటుంబ సభ్యులు!
వైజాగ్‌ మత్య్సకారుల కోసం చేపట్టిన ​రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకం! ఆందోళనలో కుటుంబ సభ్యులు!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Breaking News: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget