అన్వేషించండి

Telangana News : తెలంగాణలో రుణమాఫీపై మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌, బంగారంపై తీసుకున్న రుణాలు కూడా మాఫీ!

Telangana Runa Mafi: తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకి కూడా గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం.

Revanth Reddy Govt: తెలంగాణలో రుణమాఫీకి సంబంధించిన రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు రాకపోయినా రోజు లీక్ మాత్రం రైతులను ఊరిస్తున్నాయి. ఇప్పుడు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారని తాజాగా అందుతున్న సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇవాళ కానీ రేపు కానీ వెలువడే ఛాన్స్ ఉందన అంటున్నారు. 
రేషన్ కార్డు, లేదా పంచాయతీ శాఖ వద్ద ఉన్న రికార్డులు ఆధారంగా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను కూడా సేకరించారని తెలుస్తోంది. దీని ఆధారంగానే ఫైనల్‌ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారని చెబుతున్నారు. 

ఫైనల్‌ లిస్ట్ అప్పుడే

ఫైనల్ జాబితాను సిద్ధం చేసిన తర్వాత ఆ రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాల్లో అప్పులు ఎంత ఉన్నప్పటికీ గరిష్ంగా రెండు లక్షల రూపాయలు వరకు మాత్రమే మాఫీ చేయనున్నారు. విధివిధానాలు పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత గ్రామల వారీగా లిస్ట్ రెడీ చేస్తారు. తర్వాత బ్యాంకు అధికారులతో కలిసి ఫైనల్‌ జాబితా రూపొందిస్తారు. 

పీఎం కిసాన్ రూల్స్ వర్తింపు

తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ చేాయలంటే 31 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా నిర్దారించారు.  రుణమాఫీకి పీఎం కిసాన్‌ రూల్స్ పాటించాలని మొదటి నుంచి భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

వారికి మినహాయింపు 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐటీ కట్టే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులకు , రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారికి రుణమాఫీ లేదని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. చిరు ఉద్యోగులకు కాస్త ఊరట ఇవ్వాలని దీని కూడా ఓ స్లాబ్ పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. ముందు పిఎం కిసాన్ రూల్స్ ప్రకారం రుణమాఫీ చేసి నిధులు మిగిలితే తర్వాత ప్రాధాన్యత కింద ఉన్న వారి రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జాబితాను సిద్ధం చేయనున్నారు. 

బంగారంపై తీసుకున్న రుణాలు కూడా మాఫీ

మరోవైపు బంగారం కుదవపెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ బుక్‌ను జత చేసిన వాటికే దీన్ని వర్తింప చేయాలని కూడా చూస్తున్నారు. పట్టణాల్లో ఇలాంటి రుణాలు తీసుకుంటే వాటిని మినహాయించాలని చూస్తున్నారు. 

రైతు భోరసాపై ప్రజాభిప్రాయ సేకరణ 

మరోవైపు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలాల్లో పని చేస్తున్న మహిళలతో మాట్లాడారు రైతు భరోసా ఎలాంటి వారికి ఇస్తే బాగుటుందో అని వారిని ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలు సమస్యలను మంత్రి విని అక్కడి నుంచి బయల్దేరారు.

Also Read:  తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
Vasudeva Reddy Arrest: ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు!
ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు! రహస్య ప్రాంతంలో విచారణ
KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
RK Roja News: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Doctor Case: కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
కోల్‌కత్తా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, త్వరలోనే విచారణ
Vasudeva Reddy Arrest: ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు!
ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు! రహస్య ప్రాంతంలో విచారణ
KTR: రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
రాహుల్, ఖర్గేలకు కేటీఆర్ లేఖ - రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
RK Roja News: రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
రోజా చుట్టూ బిగుస్తున్న క్రీడల ఉచ్చు! అరెస్ట్ చేసే ఛాన్స్
Chandanagar News: చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
చందానగర్ స్పా సెంటర్‌లో వ్యభిచారం! మసాజ్ సెంటర్‌లో అమ్మాయిలతో బిజినెస్!
Kesineni Chinni: ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
Attack On Harish Rao Residence : హరీశ్ రావు ఇంటిపై దాడి, మరి సాధారణ ప్రజల పరిస్థితేంటి - బీఆర్ఎస్
హరీశ్ రావు ఇంటిపై దాడి, మరి సాధారణ ప్రజల పరిస్థితేంటి - బీఆర్ఎస్
Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Embed widget