అన్వేషించండి

Kisan Credit Card: రైతులకు శుభవార్త, కిసాన్ క్రెడిట్ కార్డ్‌ రుణాలపై వడ్డీ రాయితీ

రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. మొత్తంగా చూస్తే, కిసాన్ క్రెడిట్ కార్డ్‌ మీద తీసుకునే రుణం మీద కేవలం 4 శాతం వడ్డీ రేటు చెల్లిస్తే సరిపోతుంది.

Kisan Credit Card: భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది రైతులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఒక శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ మీద ఇచ్చే స్వల్పకాలిక రుణాల కోసం అందించే రాయితీని (KCC వడ్డీ రాయితీ) ఈ ఆర్థిక సంవత్సరంతో (2022-23) పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరం ‍‌(2023-24) కూడా కొనసాగించాలని RBI నిర్ణయించింది. 

పావలా వడ్డీకి రుణం
ఈ నిర్ణయం తర్వాత, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఉన్న ప్రతి రైతుకు వ్యవసాయ సంబంధిత పనుల కోసం బ్యాంక్‌ రుణం లభిస్తుంది. ఈ అప్పు మీద 7 శాతం వడ్డీ ఉంటుంది. ఈ 7 శాతంలో, కేంద్ర ప్రభుత్వం 1.5 శాతం మొత్తాన్ని రాయితీ రూపంలో భరిస్తుంది. అంతేకాదు, ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. మొత్తంగా చూస్తే, కిసాన్ క్రెడిట్ కార్డ్‌ మీద తీసుకునే రుణం మీద కేవలం 4 శాతం వడ్డీ రేటు చెల్లిస్తే సరిపోతుంది. ఇది, పావలా లేదా 25 పైసల వడ్డీకి సమానం.

రూ.3 లక్షల రుణం
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తుంది. రైతులు ఈ డబ్బును వ్యవసాయం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం, ఇతర వ్యవసాయ రంగ సంబంధిత పనులకు ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తదితరాల కోసం కూడా రైతులు ఈ రుణాన్ని తీసుకోవచ్చు. వడ్డీ రాయితీ పథకం (ISS) కింద, కిసాన్ క్రెడిట్ కార్డ్‌ రుణాల మీద వడ్డీ మినహాయింపును ప్రకటిస్తూ.. సెంట్రల్ బ్యాంక్ బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, కో ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.

మీరు రైతు అయితే, మీ దగ్గర ఇప్పటి వరకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ లేకపోతే, దానిని పొందడం చాలా సులభం. ఈ క్రింది పత్రాలు మీ దగ్గర ఉంటే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ మీ చేతికి అందుతుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:

ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాస్‌పోర్ట్‌ అవసరం. తాను రైతును అని నిరూపించుకునేందుకు, రైతు పేరు మీద వ్యవసాయ భూమి పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.

KCC కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఆఫ్‌లైన్‌ పద్ధతి: మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి, అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి, KCC దరఖాస్తు ఫారం నింపాలి. దీనితో పాటు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాలి. మీరు సమర్పించిన అన్ని పత్రాలను బ్యాంక్‌ నిర్ధరించుకుంటుంది. ఆ తర్వాత మీ పేరిట కిసాన్ క్రెడిట్ కార్డ్ వస్తుంది. 

ఆన్‌లైన్‌ పద్ధతి: ఇది కాకుండా, బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా కూడా మీరు KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో KCC దరఖాస్తు ప్రక్రియ అన్ని బ్యాంక్‌లకు కొద్దిగా మారుతుంటుంది. బ్యాంక్‌ సూచనలు పాటిస్తూ.. ఆన్‌లైన్‌ ఫారంలో అడిగిన మీ వివరాలు నింపి, మీ దగ్గర ఉన్న సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget