అన్వేషించండి

Electricity Voltage Detector: రైతులకు అలర్ట్! విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ; ఈ డివైస్ ధర కేవలం ₹250-₹600 మాత్రమే!

Electricity Voltage Detector Price: వ్యవసాయం చేసే రైతులు, విద్యుత్ పనులు చేసే సిబ్బంది వద్ద కచ్చితంగా ఈ పరికరం ఉండాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

Electricity Voltage Detector Price: తెలుగు రాష్ట్రాల్లో పొలం పనులు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో వర్షాలు జారు అందుకున్నాయి. అయితే ఇలా పొలం పనులకు వెళ్లిన రైతులు విద్యుత్ ఘాతంతో మృతి చెందే ఘటనలు చూస్తూనే ఉంటారు. అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ చాలా ఉపయోగపడుతుంది. పొలానికి వెళ్లే ప్రతి రైతు వద్ద కచ్చితంగా ఉండాల్సిన పరికరమని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. 

ఎందుకు అవసరం 
పొలంలో మోటార్ ఆన్ చేయడనికో, లేదా పొలంలో ఉన్న పంట చూడటానికో రైతులు వెళ్తుంటాడు. పడుతున్న వర్షాల కారణంగా విద్యుత్ మోటార్లు ప్రాంతంలో ప్రమాదాలు జరగొచ్చు. కరెంటు షాక్‌తో ప్రాణాలు పోవచ్చు. మరోవైపు చాలా మంది పంటలను కాపాడుకునేందుకు విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ జంతువుల నుంచి పంట కాపాడుకునేందుకు ఇలాంటి విద్యుత్ తీగలతోకూడిన కంచెలను ఏర్పాటు చేస్తారు. వాటిని తెలియకుండానే తగిలిన రైతులు మృతి చెందుతున్నారు. 

వర్షాలకు గాలి వానలకు విద్యుత్ స్తంభాలు ఒడిపోవడం లేదా వాటిపై చెట్లు పడి ఆ విద్యుత సరఫరా పొలంలో ఉన్న పైరుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.  ఇలాంటి ప్రమాదాల్లో కూడా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎలా పని చేస్తుంది?
పొలాల్లో జరిగే ఇలాంటి ప్రమాదాల నుంచి తమను కాపాడుకోవడానికి రైతులు ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఉంచుకోవాలని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు చాలా వరకు తగ్గించవచ్చని అంటున్నారు. ఇందులో ఇందులో రెండు రకాల బటన్స్ ఉంటాయి. హెచ్‌లో పెట్టుకుంటే దాదాపు ఏడు మీటర్ల దూరంలో ఉన్న విద్యుత్ సరఫరాను గుర్తించివచ్చు. ఎల్‌ అటే సమీపంలోకి వెళ్తే కానీ విద్యుత్ సరఫరా గురించి తెలియదు. విద్యుత్ సరఫరా తెలియజేసేందుకు అలారం కూడా మోగుతుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎక్కడ లభిస్తుంది?
ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఏ ఎలక్ట్రికల్ షాపులోనైనా లభిస్తుంది. లేదంటే ఆన్‌లైన్‌ స్టోర్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్టు లాంటి వాటిలో కూడా దొరుకుతుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ధర ఎంత 
ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఒక్కో కంపెనీ ఒక్కో ధర ఉంది. ఇది 250 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. అందులో ఫెసిలిటీస్‌ను బట్టి ధర ఉంటుంది. ఏ ధర ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ తీసుకున్నా పని చేసే తీరు మాత్రం ఒకటే ఉంటుంది. 

ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? 
ఎలక్ట్రిసిటీ ఓల్టేజీ డిటెక్టర్‌ డివైస్‌ కేవలంరైతులకే కాదు విద్యుత్ పని చేసే వారికి కూడా పని చేస్తుంది. ఇంట్లో కూడా మీరు ఉంచుకోవడం మంచిది. ఇంట్లో చేసే చిన్న చిన్న విద్యుత్ పరికరాల రిపేర్లకు వైరింగ్‌కు సంబంధించిన రిపేర్లు చేసేటప్పుడు ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Sugar From 1 Quintal Sugarcanes: ఒక క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది? తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఒక క్వింటా చెరకు నుంచి ఎంత చక్కెర ఉత్పత్తి అవుతుంది? తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget