IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మరో నగదు బదిలీ పథకం- బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు రైతు ఖాతాల్లో వేయాలన్న సీఎం

వైఎస్‌ఆర్‌ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుందని... దీని కోసం నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్.

FOLLOW US: 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
జిల్లాల వారీగా పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

చెరువుల అనుసంధానం

చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. దీని వల్ల రానున్న ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువ, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేసేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. ఇలా చేయగలిగితే నీటిఎద్దడిని నివారించగలుగుతామన్నారు సీఎం. కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్‌ చేయాలన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

సొంత భవనాల ఏర్పాటు

ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్నారు. ఈ నిర్మాణాలు పూర్తైన ప్రతిచోటా నవరత్నాలు ఫొటో ఉండేలా చూడాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయన్న సీఎం అయినా వాటిని అధిగమించి పురోగతి సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. భవన నిర్మాణ పనులు ఆగకూడదన్న జగన్...అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

దిల్లీలో ప్రత్యేక అధికారి

ఉపాధి హామీ పనులుకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌తోపాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదని దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలన్నారు. అవసరమైతే దిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి సూచించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు సీఎం.

నేరుగా రైతు ఖాతాల్లోకే

వైఎస్‌ఆర్‌ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుందని... దీని కోసం నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం జగన్. 175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలన్నారు. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్న సీఎం... నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామని... ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు రైతు అకౌంట్‌కు నేరుగా జమ చేసి... వారి నుంచి బోర్లు వేసేవాళ్లకు పేమెంట్‌ అయ్యేలా ఏర్పాటు చేయాలన్నారు సీఎం. 

నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల లంచాలు లేని వ్యవస్థ తీసుకురాగలమన్నారు సీఎం జగన్. దానికి సరిపడా ఎస్‌ఓపీలు రూపొందించాలన్నారు సీఎం. ఫలితంగా మరింత పారదర్శకత పెరుగుతుందన్నారు సీఎం. ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకు అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు వేస్తామన్నారు. 5–10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు కేవలం డ్రిల్లింగ్‌ మాత్రమే ఉచితమని తెలిపారు. 

గ్రామీణ రోడ్లకు మహర్దశ

గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు సీఎం. రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదన్నారు. ఆర్‌ అండ్‌ బీలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయిని... గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు తక్షణమే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. 
వెంటనే టెండర్లకు వెళ్లాలన్నారు సీఎం. ఆర్‌ అండ్ బి, పంచాయితీరాజ్‌ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్‌ప్లే చేయాలని సూచించారు. మే 15 -20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలన్నారు సీఎం. పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి సంబంధించిన పనులు అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు సీఎం. పాట్‌ హోల్‌ ఫ్రీ బీటీ రోడ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్నింటికీ నాడు నేడు ఫొటోలు

గ్రామ, వార్డు సచివాలయంలో నాడు-నేడు పనులకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్యం, రహదారులుపై చేపట్టిన పనులకు సంబంధించి ఫోటోలను డిస్‌ప్లే చేయాలన్నారు సీఎం. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను కూడా డిస్‌ప్లే చేయాలి సూచించారు. జలజీవన్‌ మిషన్‌ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలన్న సీఎం... జలజీవన్‌ మిషన్‌కు సంబంధించి నాబార్డు, కేంద్రం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలి అధికారులకు ఆదేశించారు.

గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం. గ్రామాల్లో  రోడ్లమీద మురుగునీరు, చెత్త లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలని టార్గెట్ ఫిక్స్‌ చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా ఉండాలని ఊర్లన్నీ క్లీన్‌గా కనిపించాలన్నారు. 

త్వరలోనే అందరికి చెత్త డబ్బాలు

2 కోట్ల డస్ట్‌బిన్లను అక్టోబరు నాటికి  సిద్ధంగా ఉంచుతామన్నారు అధికారులు. డస్ట్‌బిన్లు ఇచ్చిన తర్వాత తడి, పొడి చెత్తలపై విడివిడిగా అవగాహన కలిగించాలన్నారు సీఎం. ప్రతీ పంచాయతీకి చెత్త తరలింపునకు ఓ ట్రాక్టర్‌ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుమీద ఎక్కడా చెత్త, మురుగునీటి ప్రవాహం కనిపించకూడదని ఆదేశించారు. హై ప్రెజర్ టాయ్‌లెట్ క్లీనర్స్‌ నెంబర్లు ప్రతిగ్రామంలోనూ డిస్‌ప్లే చేయాలన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌కు సంబంధించిన క్లాప్ మిత్ర జీతాలు చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో దశల వారీగా లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టాలన్నారు సీఎం. 46 లిక్విడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత 632 డీస్లడ్జింగ్‌ మిషన్స్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధికారులు. దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలన్నారు సీఎం. 13వేల గ్రామ పంచాయతీల్లో కూడా మురుగునీటిపారుదల వ్యవస్ధ ఉండేలా... రోడ్లమీద చెత్త, కాలువల్లో మురుగునీరు ఓవర్‌ప్లో కాకుండా సక్రమంగా నిర్వహణ చేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంతోపాటు... దాన్ని సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్నారు. గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతోపాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్నారు సీఎం. స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతోపాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు.

Published at : 02 May 2022 07:33 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan RBK Village Clinics

సంబంధిత కథనాలు

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Karimnagar: ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం - బ్రిటీష్ హయాం నుంచి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్‌ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !

YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్‌ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !

Mango Fruits: మామిడి పండ్ల ను కొంటున్నారా ... అయితే ఇది మీకోసమే .. !

Mango Fruits: మామిడి పండ్ల ను కొంటున్నారా ... అయితే ఇది మీకోసమే .. !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!

LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!

Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!

Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి

Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్‌, ముచ్చటగా మూడోసారి