బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 106 రోజుల పాటు ఈ షో నడిచింది. 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. చివరికి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో ముందుగా సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఫైనల్ గా సన్నీ, షణ్ముఖ్ లు హౌస్ లో ఉండడంతో వారిద్దరిలో టెన్షన్ పెరిగిపోయింది. ఎప్పుడూ కూడా విన్నర్, రన్నరప్ ని స్టేజ్ పై అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పేలా షో డిజైన్ చేశారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ ని ఈజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెతో కలిసి సన్నీ, షణ్ముఖ్ డాన్స్ లు చేశారు. ఆ తరువాత వారిద్దరితో చిన్న గేమ్ ఆడించారు. అందులో షణ్ముఖ్ ఎలిమినేట్ అవ్వడంతో సన్నీ విన్నర్ గా నిలిచాడు.
ఫిలడెల్ఫియాలో ఆసక్తికర సంఘటన...ఆటోపైలెట్ కారులో ప్రసవం
2021లో భారతీయులు అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు.
Hot Water: మహబూబాబాద్ శివాలయంలో వింత ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన.!
Submarine : నవంబర్ 25 న ముంబై లో సబ్‌మెరైన్ కమీషన్ చేయటానికి సిద్ధం
Viral Video : పసిప్రాయంలోనే శ్రీకృష్ణుడి శ్లోకాలు చెప్పేస్తున్న చిన్నారి
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా