AP లో తెర గురించి తెరవెనుక రాజకీయాలు? తెలంగాణలో వరి కొనుగోలుకు క్లారిటీ వచ్చిందా?
AP లో వినోదాంశం ఇప్పుడ వివాదం మారింది. నేల టిక్కెట్టుపై రాజకీయాలు నడుస్తున్నాయి. టిక్కెట్ల ధరల తగ్గించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏపీలో తెలుగు సినిమా గురించి అంతా చర్చించుకుంటున్నారు. అంటే సినిమా గొప్పతనం గురించి కాదు. సినిమాలు ఆడించాలా వద్దా అని ఎగ్జిబిటర్లు... అసలు సినిమాలు విడుదల చేయాలా? వద్దా అని నిర్మాతలు అనుకుంటున్నారు. సినిమా టిక్కెట్ల రేట్లు విషయంలో హైకోర్టు ఇచ్చిన డైరక్షన్స్ ఎందుకు పాటించడంలేదని అనేవారు లేకపోలేదు. హీరో నాని వ్యాఖ్యలతో మరింత వేడెక్కింది సినిమా టెక్కెట్ల వ్యవహారం. ఇక ఏపీ మంత్రులు టిక్కెట్ల ధరల విషయంలో మాత్రం ప్రేక్షకులు హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. ఇలా ఈ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది.























