![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KKR vs SRH IPL 2024 Final | చెన్నై చెపాక్ లో సన్ రైజర్స్ రివెంజ్ తీర్చుకుంటుందా.? | ABP Desam
అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటుంది నాయనా అని బ్రహ్మానందం కి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ సీజన్ లో SRH, KKR రైవల్రీ తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. ఈ ఐపీఎల్ సీజన్ ను ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ మ్యాచ్ తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ 4పరుగుల తేడాతో కోల్పోయింది. ఆ మ్యాచ్ లో ఛేజింగ్ లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ ఓడినా ఈ సారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ 1 లోనే. క్వాలిఫైయర్ 1 లో మళ్లీ సన్ రైజర్స్ పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్ కతా ఈసారి ఏకంగా 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించి నేరుగా ఫైనల్ కి చేరుకుంది. క్వాలిఫైయర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్ లో మళ్లీ కోల్ కతా తో తలపడనుంది. మరి ఈసారి ఏం చేస్తాడు మీ హీరో అని కేజీఎఫ్ లో పెద్దావిడ అడిగినట్లు మరి ఇప్పుడు SRH ఏం చేస్తుంది. ఈ సీజన్ లో కోల్ కతా చేతిలో ఎదురైన రెండు పరాభావాలకు సమాధానం ఫైనల్ లో ఇచ్చి KKR కు ఊహించ లేని షాక్ ఇస్తుందా...లేదా ఫైనల్లోనూ కోల్ కతా కు తలవంచి ఏం ఉందిలే ఇంక పడుకోండి అని ఫ్యాన్స్ కి ఆరెంజ్ జ్యూస్ ఇస్తుందా తెలియాలంటే మే26వ తేదీన ఇదే చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
![Rishabh Pant Runs and Catches vs Pak | Ind vs Pak మ్యాచ్ లో కీలకంగా రాణించిన పంత్ | T20 World Cup24](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/81b8ff3d894f3277038aa274b06b15911717992022436310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Shah Rukh Khan Chants CSK | కేకేఆర్ కప్పు గెలిచాక ధోనీ, మెస్సీకి షారూఖ్, అయ్యర్ ట్రిబ్యూట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b32a62b62eda69d4dedba0b0230880271716869936718310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan Flying kisses Along with KKR Team | హర్షిత్ రానాకు షారూఖ్ ఖాన్ మద్దతు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/858fd10b5b37dc70b9afc50832b453f61716869763338310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Kavya Maran with SRH Team After Loss | IPL 2024 KKR vs SRH Final ఓడిపోయాక కావ్యా మారన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/6f9a385ff21526ecdc2a3c20db7fc68f1716869675709310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan KKR IPL 2024 Win | పదేళ్ల తర్వాత కేకేఆర్ తో కప్ కొట్టిన షారూఖ్ ఖాన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/27/5055b537c932df7026dbc5316c77cd581716786736686310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)