IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజయంతో సత్తా చాటిన బెంగుళూరు
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో.. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మిషెల్ మార్ష్ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక ఛేజింగ్ లో ఆర్సీబీ కేవలం 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి, టార్గెట్ ను కంప్లీట్ చేసింది. అయితే టర్గెట్ చిన్నదే అయినా ఆర్సీబీకి ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో నే ఎదురుదెబ్బ తగలింది. ఫిల్ సాల్ట్ 7 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ విరుచుకుపడ్డాడు. కాసేపటికే ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడు. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా పర్వాలేదనిపించాడు. ఈ గ్యాప్ లోనే కోహ్లీ 49 పరుగులకు అవుట్ అయి హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
కోహ్లీ ఔటైనప్పటికీ, మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడడం మొదలు పెట్టారు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కూడా బౌండరీలతోనే డీల్ చేయడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో ఫస్ట్ పొజిషన్ కు చేరుకుంది.
ట్రెండింగ్ వార్తలు




















