Dhoni CSK 25% Share Controversy | ధోనీ 25% సీఎస్కే వాటా? ఆకాష్ చోప్రా క్లారిటీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీలది విడదీయరాని అనుబంధం. 45 ఏళ్ల వయసులోనూ ఆయన మైదానంలోనూ, బయటా జట్టుకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2027 రిటెన్షన్ తేదీలు ఇంకా ఖరారు కాకముందే సీఎస్కే యాజమాన్యం వద్ద ధోనీ 25 శాతం వాటా కోరాడని, ఆ తర్వాత 20 శాతానికి తగ్గించగా ఫ్రాంచైజీ 5.5 శాతం ఆఫర్ చేసిందంటూ సోషల్ మీడియాలో కథనాలు సంచలనం రేపాయి.
ఈ వార్తలపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పాడు. సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్గా నిలవడమే కాకుండా విదేశీ లీగ్ లలోనూ జట్లను కలిగిన గ్లోబల్ బ్రాండ్. ఆర్సిబి వంటి జట్ల విలువ ఆధారంగా లెక్కిస్తే, సీఎస్కే విలువ దాదాపు 1.8 బిలియన్ డాలర్లు అంటే 15,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో 25 శాతం వాటా అంటే దాదాపు 400 మిలియన్ డాలర్లు. అంతటి భారీ మొత్తాన్ని ఉచితంగా ఏ ఫ్రాంచైజీ ఇవ్వదని, అంత వాటా కావాలంటే 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సిందేనని ఆకాష్ చోప్రా స్పష్టం చేశాడు.
ఇక 5.5 శాతం వాటా ఆఫర్ చేశారనడంలోనూ నిజం లేదని, అంత తక్కువ శాతమైనా వందల కోట్ల విలువ చేస్తుందని వివరించాడు. మొదట 25 శాతం అనడం, ఆపై చర్చలు విఫలమయ్యాయని ప్రచారం చేయడం పక్కా ప్లాన్ ప్రకారం సృష్టించిన ఫేక్ కథనంలా కనిపిస్తోందని విశ్లేషించాడు.
ట్రెండింగ్ వార్తలు






















