అన్వేషించండి

Srilanka vs India 3rd T20 Highlights | నామమాత్రపు మ్యాచ్ ను లంకకు దక్కనివ్వని యంగ్ ఇండియా | ABP

   ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఒక ఐదు ఓవర్లలో మ్యాచు మొత్తం మారిపోయింది. మ్యాచ్ తో సిరీస్ కూడా భారత్ వశమైపోయింది. శ్రీలంకకు వైట్ వాష్ తప్పలేదు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో జరిగిన విశేషాలివి. ముందు బౌలింగ్ చేసిన శ్రీలంక టీమిండియా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత్ 48పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 39పరుగులు గిల్ టాప్ స్కోరర్ గా నిలవటం మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. జైశ్వాల్, శాంసన్, రింకూ, సూర్య, శివమ్ దూబే చేతులెత్తేసినా..లోయర్ మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ అండ్ వాషింగ్టన్ సుందర్ భారత్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ముందు గిల్ తో పరాగ్ వికెట్ల పతనం ఆపితే తర్వాత సుందర్ పోరాడటంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 137పరుగులు చేసింది. శ్రీలంక తమ స్పిన్నర్లను ఎంత నమ్ముకుందంటే తమ కీ బౌలర్ మతీషా పతిరానాను బౌలింగ్ కి కూడా దింపలేదు. తర్వాత 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంకను టాప్ 3 ఆటగాళ్లు ఓ రేంజ్ లో నిలబెట్టారు. 15ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు వికెట్ నష్టానికి 108పరుగులు..అంటే మిగిలిన 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే చాలు..చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. చాలా ఈజీ టార్గెట్ శ్రీలంకకు. అందరూ ఏం ఉందిలే లంకే గెలుస్తుంది అనుకున్నారు. కానీ సుందర్, బిష్ణోయ్ లు మ్యాజిక్ చేశారు. చకా చకా వికెట్లు తీశారు.ఓ పక్క వికెట్లు పడుతున్నా శ్రీలంక లక్ష్యం దిశగానే సాగింది. ఇక మిగిలింది ఆఖరి రెండు ఓవర్లు. 12బంతుల్లో 9పరుగులు చేస్తే చాలు శ్రీలంక విన్. ఈసారి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. బంతిని తీసుకెళ్లి రింకూ సింగ్ చేతిలో పెట్టాడు. అత్యంత అరుదుగా బౌలింగ్ చేసే రింకూ సింగ్ ను తక్కువ అంచనా వేసింది శ్రీలంక. రింకూ అద్భుతంగా బౌలింగ్ చేసి 3పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక చివరి ఓవర్ ఆరు పరుగులు కొట్టాలి శ్రీలంక. ఈ సారి బంతిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవే పుచ్చుకున్నాడు. మళ్లీ అదే మ్యాజిక్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయటమే కాదు మ్యాచ్ ను సూపర్ ఓవర్ కు తీసుకెళ్లాడు సూర్యకుమార్ యాదవ్. సూపర్ ఓవర్ లో వాష్టింగ్టన్ సుందర్ మరో సారి మ్యాజిక్ చేసి రెండు పరుగులే ఇచ్చి శ్రీలంకను ఆలౌట్ చేశాడు. 3పరుగుల టార్గెట్ ను కెప్టెన్ సూర్య ఫోర్ కొట్టి భారత్ కు ఊహించని రీతిలో విజయాన్ని అందించాడు. కళ్ల ముందే భారత్ మ్యాచ్ ను లాగేసుకుంటుంటే ఏం చేయలేక వైట్ వాష్ అయ్యింది శ్రీలంక జట్టు.

క్రికెట్ వీడియోలు

Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Top 10 Batsman: ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్‌లు వీళ్లే! భారతీయ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారంటే? 
ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్‌లు వీళ్లే! భారతీయ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారంటే? 
Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
ABP Premium

వీడియోలు

Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
Self Murder: రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
రీల్ కోసం సెల్ఫ్ మర్డర్ చేసుకున్న యవకుడు - ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది!
Jaripey Song: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
'ఉస్తాద్...' కోసం 'తొలిప్రేమ' సాంగ్ రీమిక్స్... ట్రైలర్‌లో హింట్
Salim Khan Discharged: ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
ఆసుపత్రి నుంచి సల్మాన్ తండ్రి డిశ్చార్జ్... నెల తర్వాత ఇంటికి సలీం ఖాన్
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
Embed widget