అన్వేషించండి

Sanju Samson consecutive ducks | SL vs IND సిరీస్ లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే | ABP Desam

 సంజూ శాంసన్. అద్భుతమైన ఆటగాడు..అద్భుతమైన కెప్టెన్ కూడా. మనం చూస్తున్నాం రాజస్థాన్ రాయల్స్ ను ఏళ్లుగా సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. యశస్వి జైశ్వాల్ లాంటి యంగ్ స్టర్స్ ను జోస్ బట్లర్ లాంటి సీనియర్లను కలిపి నడిపించగల సమర్థుడు. అలాంటి శాంసన్ టీమిండియా తరపున ఆడటంలో ఎందుకో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూస్తాడు. తీరా ఆ ఛాన్స్ వస్తుంది. అప్పుడే ఇదిగో ఇలా బాతు గుడ్లు పెడుతూ ఉంటారు. మా వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండిరా అని సంజూ ఫ్యాన్స్ మళ్లీ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ ఈసారి శ్రీలంక తో టీ20 సిరీస్ సంజూ శాంసన్ బ్యాడ్ లక్ కంటే స్వయంకృతాపరాధం అని చెప్పాలి. ఎందుకంటే మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో అసలు ఫస్ట్ సంజూను తీసుకోలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ కావటంతో ఫస్ట్ ఛాయిస్ కీపర్ గా పంత్ నే ఎంచుకున్నారు. మా సంజూనే ఎన్నిసార్లు పక్కనపెడతారు అంటూ ఫ్యాన్స్ మళ్లీ ఏడుపు మొదలుపెట్టారు. వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు ఆడనివ్వలేదు..ఇప్పుడు ఈ బచ్చా సిరీస్ లో కూడా ఆడనివ్వకుండా మా వాడిని తొక్కేస్తున్నారంటూ ఒకటే పెడబొబ్బలు. సరే రెండో టీ20 మ్యాచ్ లో అవకాశం వచ్చింది. గిల్ మెడ పట్టేయటంతో అనూహ్యంగా టీమ్ లోకి వచ్చాడు సంజూ భాయ్. 8ఓవర్లే మ్యాచ్. మతీషా పతిరానా బౌలింగ్ . ఐపీఎల్ లో అతన్ని బాగానే ఆడిన సంజూ రెండో టీ20 మ్యాచులో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్. సర్లే ఒక్క మ్యాచే కదా అది కూడా ఫుల్ మ్యాచ్ కాదు. మళ్లీ ఎప్పుడు వస్తుందో అవకాశం అనుకున్నారు అంతా. ఆశ్చర్యకరంగా సూర్య కుమార్ యాదవ్, అండ్ గంభీర్ కలిసి మళ్లీ మూడో టీ20 మ్యాచులోనూ అవకాశం ఇచ్చారు. ఈసారి గిల్ తిరిగివచ్చినా కూడా శాంసన్ ను నిన్న మ్యాచ్ లో కొనసాగించారు. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేయటంతో భారత్ టాపార్డర్ కుప్పకూలింది. సంజూ శాంసన్ కు హీరో అయిపోయే అవకాశం. కావాల్సినంత సేపు ఆడుకునే ఛాన్స్. తనెంత క్యాపబుల్ ప్లేయరో ప్రూవ్ చేసుకునేంత స్టేజ్. సంజూ ఏం చేశాడో తెలుసా మళ్లీ డకౌట్ అయ్యాడు. అది కూడా చెత్త షాట్ ఆడి. ఇదైతే క్షమించరాని నేరం అంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఛాన్స్ ల కోసం అన్నిసార్లు వేచి చూసే సంజూ శాంసన్ ఇలా అవకాశం వచ్చినప్పుడు బాధ్యతగా ఆడకపోతే ఎలా అంటూ మీమ్స్ అండ్ ట్రోల్స్ తో ఏకేస్తున్నారు. లంకతో వన్డే సిరీస్ లో సంజూ లేడు. సో మళ్లీ టీ20 సిరీస్ లో శాంసన్ కు చోటు ఉంటుందో లేదా 29ఏళ్ల ఈ బ్యాటర్ ను ఇక నమ్ముకోవటం అనవసరం లే అని యంగ్ స్టర్స్ కి ఛాన్స్ ఇస్తారో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
CoE Fitness Overhaul: ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget