IND vs Pak Asia Cup 2025 | ఆకాశాన్నంటుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధరలు | ABP Desam
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్.. క్రికెట్ ప్రపంచంలోనే ఇదొక హై-వోల్టేజ్ మ్యాచ్. స్టేడియంలో టికెట్ దొరకడమే అదృష్టంగా భావించే మ్యాచ్ ఇది. టికెట్లు ఓపెన్ అయిన గంటల్లోనే హాట్ కేకుల కంటే ఫాస్ట్‌గా అమ్ముడైపోతాయి. బ్లాక్ మార్కెట్లో అయితే వెయ్యి టికెట్ లక్ష కూడా పలుకుతుంది. కానీ ఈసారి పరిస్థితి వేరు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఈ సారి ఆసియా కప్‌లో కథ మారింది. ఆదివారం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతుండగా.. ఆ మ్యాచ్ టికెట్లు చాలా వరకు అమ్ముడు పోకుండా మిగిలిపోయాయి. ఏంటీ, నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. దీనికి కారణం టికెట్ల ధర. సాధారణంగా మ్యాచ్ టికెట్ వెయ్యి, 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్ టికెట్ల స్టార్టింగ్ ప్రైజే 10వేలు. ఇక హయ్యస్ట్ ప్రైజ్ ఏకంగా రెండున్నర లక్షలు. ఈ ధరలకి ఎక్కడైనా సామాన్య అభిమానులు టికెట్ కొనగలుగుతారా..? ఈ రేట్ల ప్రకారం.. ఒక చిన్న ఫ్యామిలీ మ్యాచ్ చూడాలనుకున్నా.. కనీసం 20 నుంచి 30 వేలు ఖర్చు చేయాలి. అది కూడా జస్ట్ కూర్చోవడానికి మాత్రమే స్పేస్ దొరుకుతుంది. అందుకే మిడిల్ క్లాస్ జనాలు స్టేడియంకి మేం రాం మహా ప్రభో.. మేం టీవీలో చూసుకుంటాం’ అంటూ దండం పెడుతున్నారు. ఇదేమీ పట్టించుకోని ఆర్గనైజర్లు మాత్రం.. 2.5 లక్షల ధర ఉన్న విఐపీ సూట్స్, ₹2.3 లక్షల ధర ఉన్న రాయల్ బాక్స్ ప్యాకేజీలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో లాంజ్ యాక్సెస్, ఫుడ్ సర్వీస్ ఉంటుంది. కానీ 3 గంటల మ్యాచ్ చూడటానికి వచ్చినవాళ్లకి లాంజ్, ఫుడ్ ఎందుకో అర్థం కావట్లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కోపంలోనే చాలామంది సోషల్ మీడియాలో "గ్రీడీ ఆర్గనైజర్స్" అంటూ వాళ్ల కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ని లైవ్ చూడాలనుకునే క్రికెట్ అభిమానుల అభిమానాన్ని ఇలా వాడుకుంటారా..? ఇంత అత్యాశతో వాళ్ల జేబులు ఖాళీ చేయడానికి రెడీ అవుతారా..? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా.. అసలు పెహల్గామ్ ఎటాక్ తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటంపై కూడా ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనివల్లే లెజెండ్స్ లీగ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంది ఇండియా లెజెండ్స్ టీమ్. ఇక దీంతో ఫ్యాన్స్ అంతా ఆసియా కప్‌లో కూడా టీమిండియా.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి వీల్లేదని తెగ గొడవ చేశారు. అయితే ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం తప్పదు కాబట్టి.. ఈ మ్యాచ్ ఆడటానికి బీసీసీఐ ఒప్పుకుంది. అయితే మ్యాచ్ జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ కోపంగా ఉన్నా.. కొంతమంది మాత్రం.. ఈ మ్యాచ్ ఆడి ఇందులో పాకిస్తాన్‌ని టీమిండియా చిత్తుగా ఓడించి పగ తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. అయితే అలాంటి వాళ్లలో చాలామంది ఈ మ్యాచ్‌ని లైవ్ లో చూడాలని ఉన్నా.. టికెట్ ధరలు చూసి భయపడిపోతున్నారు. మరి ఈ టికెట్ రేట్లపై మీ ఒపీనియన్ ఏంటి?





















