Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
ఐపీఎల్ 2026 సీజన్‌లో అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరికొన్ని రోజుల పాటు మైదానానికి దూరం కానున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలతో దూకుడు మీదున్న ఢిల్లీకి స్టార్క్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ప్రస్తుతం ముఖేష్ కుమార్, టి నటరాజన్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తున్నప్పటికీ, స్టార్క్ వంటి సీనియర్ బౌలర్ రాక కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, స్టార్క్ భుజం అలాగే మోచేతి గాయాలతో సతమతమవుతున్నాడు. వీటి నుండి కోలుకోవడానికి ఆయనకు మరింత సమయం పట్టేలా ఉంది. ఏప్రిల్ 20 తర్వాతే ఆయన ఢిల్లీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. దీనివల్ల గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే కీలక మ్యాచ్‌లకు స్టార్క్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ బౌలింగ్ లైనప్ బాగున్నప్పటికీ, స్టార్క్ రాకతో మరింత పవర్‌ఫుల్ గా మారుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తన గైర్హాజరీపై సోషల్ మీడియాలో, ఇండియన్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై స్టార్క్ తీవ్రంగా స్పందించాడు. ఐపీఎల్ పట్ల తనకు నిబద్ధత లేదని కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశాడు.























