Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
ఇలాంటి విపత్కర పరిస్థితిని ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఎదుర్కోలేదేమో. జింబాబ్వే చేతిలో మొన్న ఓడిపోయి...ఇవాళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడిపోవాలని కోరుకున్న ఆస్ట్రేలియా ఆశలు అడియాసలయ్యాయి. కీలకమైన ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచుల్లో ఐదు పాయింట్లు సాధించిన జింబాబ్వే గ్రూప్ బీ నుంచి రెండో జట్టుగా సూపర్ 8 కి అర్హత సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా నుంటి టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం సాధించగా..సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో శ్రీలంక కూడా ఆస్ట్రేలియాను ఓడించటంతో ఆ జట్టు సమీకరణాలన్నీ మారిపోయాయి. జింబాబ్వే ఐర్లాండ్, శ్రీలంక చేతుల్లో ఓడిపోయి...ఆస్ట్రేలియా ఒమన్ పై భారీ విజయం సాధిస్తే తప్ప ఆస్ట్రేలియా సూపర్ 8 కి అర్హత సాధించే పరిస్థితి లేకపోగా...అసలు వర్షం కారణంగా జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచే జరగకపోవటం...ఆ రెండు జట్లకు చెరో పాయింట్ రావటంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే నిష్రమించకతప్పలేదు. 2009 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించటం ఇదే. అయితే జింబాబ్వే తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కి అర్హత సాధించింది.





















