IBPS RRB నోటిఫికేషన్ విడుదల.. 10 వేలకు పైగా బ్యాంకు ఉద్యోగాలు..

Continues below advertisement

బ్యాంకు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection) గుడ్‌ న్యూస్ అందించింది. 2021 సంవత్సరానికిగానూ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ X (సీఆర్‌పీ X) ద్వారా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్‌బీ) ఖాళీగా ఉన్న 10,447 ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం  దరఖాస్తు ప్రక్రియ జూన్ 8వ తేదీన ప్రారంభమవ్వగా.. జూన్ 28వ తేదీతో ముగియనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమనరీ పరీక్ష ఆగస్టు నెలలో, మెయిన్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరగనుంది. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

పరీక్ష విధానం: 

ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్), ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ సబ్జెక్టులు ఉంటాయి. ఆఫీసర్ స్కేల్ 1 పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. ప్రతి విభాగంలో 40 మార్కుల చొప్పున రెండింటికీ కలిపి మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ ప్రశ్నలు అన్నీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రిలిమనరీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. 
మెయిన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్), ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ పరీక్షలో రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబులిటీ, లాంగ్వేజ్ పేపర్ ఉంటాయి. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దీని ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. 

విద్యార్హత:

పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ఱతతో పాటు సంబంధిత అనుభవం కూడా ఉండాలి. 

మరిన్ని వివరాలు:

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
వెబ్‌సైట్‌:https://www.ibps.in/ 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-06-2021
దరఖాస్తులకు చివరి తేది: 28-06-2021
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021
మెయిన్ పరీక్ష: సెప్టెంబర్ / అక్టోబర్, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175, మిగతా వారికి రూ.850

పోస్టుల వివరాలు: 

  1. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) - 5096 
  2. ఆఫీసర్‌ స్కేల్‌-1 - 4119
  3. ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) - 25
  4. ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) - 43
  5. ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) - 10
  6. ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) - 27
  7. ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) - 32
  8. ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) - 59
  9. ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) - 905
  10. ఆఫీసర్‌ స్కేల్‌- 3 - 151 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola