Abhishek Sharma Golden Duck | అభిషేక్ శర్మ గోల్డెన్ డక్

Continues below advertisement

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోని ( India vs New Zealand ) నాల్గవ మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలయింది. డేంజరస్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఈ మ్యాచ్ లో తోలి బంతికే అవుట్ అయి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. 

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ ( Matt Henry ) ఆఫ్ స్టంప్ వెలుపల బంతితో అతన్ని అవుట్ చేశాడు. అభిషేక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ క్యాచ్ అవుట్ అయ్యాడు. అభిషేక్ గోల్డెన్ డక్ తో స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 

ఈ సిరీస్ లో అభోషేక్ శర్మ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి టీ20 మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసాడు. సెకండ్ మ్యాచ్ లో డక్ అవుట్ అవగా మూడవ మ్యాచ్ లో 20 బంతుల్లో 68 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ లో అవుట్ అవడంతో ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటైన భారత ఓపెనర్ల జాబితాలో అభిషేక్ చేరాడు. కేఎల్ రాహుల్, పృథ్వీ షా, రోహిత్ శర్మ, సంజు సామ్సన్ ఈ లిస్ట్ లో ఉన్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola