Shivam Dubey in Ind vs NZ 4th T20 | దూబే హాఫ్ సెంచరీ వృథా!

న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో T20 లో శివం దూబే ( Shivam Dubey ) 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. T20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కొద్దీ రోజుల క్రితం అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, భారతదేశం తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచాడు. శివం దూబే తన ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 63 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు దూబే బ్యాటింగ్‌కు వచ్చాడు. అక్కడి నుంచి దూబే ఒంటి చేత్తో టీమ్ ఇండియాను ముందుకు తీసుకోని వచ్చాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో దూబే 20 బంతుల కంటే తక్కువ బంతుల్లో  అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. 

దూబే జోరు చూస్తుంటే భారత్ గెలిచేలా కనిపించింది. కానీ బాల్ బౌలర్ చేతికి తగిలి మళ్ళి వికెట్లను తాకడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దూబే రనౌట్ అయ్యాడు. ఈ వికెట్‌తో భారత్ గెలుస్తుంది అన్న ఆశలు ఆవిరయ్యాయి. చివరికి భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola