Rangoli for Samakka in Medaram Jatara | సమ్మక్క రాక కోసం ముగ్గులు వేసిన భక్తులు

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారక్క జాతరలో దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులు తమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవతలను ప్రత్యేకంగా అక్కడే గుడారాలు వేసుకొని మూడు రోజుల పాటు ఉండి గద్దెలు కట్టి సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు. సమ్మక్క సారక్క జాతరలో రెండో రోజు ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో చిలకల గుట్ట నుండి సమ్మక్క దేవత రాక కోసం రోడ్లపై భక్తి శ్రద్ధలతో ముగ్గులు వేసి యాటలను బలి ఇస్తూ భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. సమ్మక్క, సారక్క, గోవింద రాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ దేవతలకు కోయ ఆదివాసీలు పవిత్రంగా నిర్వహించే పూజలు ఏంటి..? చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి వస్తున్న సమ్మక్క కోసం భక్తులు ఎలా ముగ్గులు వేశారు..? సమ్మక్కకు మొక్కులు ఎలా చెల్లిస్తున్నారు..? ముగ్గుల రూపంలోనూ సాంప్రదాయ పూజల మొక్కులు వీటి ప్రత్యేకత ఏమిటి..? మేడారం జాతరలో ఆదివాసీలతో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola