Ind vs Nz 5th T20 Highlights | న్యూజిలాండ్ పై ఐదో టీ20 లో భారత్ విజయం | ABP Desam

 పోరాడినా కొట్టగలిగే స్కోరు కాదులే అది. అందుకే న్యూజిలాండ్ పై ఐదో టీ20 లో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్ 225పరుగులైతే చేయగలిగింది మ్యాచ్ ను మాత్రం గెలవలేకపోయింది. భారీ టార్గెట్ ఛేజ్ లో ఫిన్ అలెన్ అద్భుతంగా పోరాడాడు. అచ్చం ఇషాన్ కిషన్ ఎలా అయితే అగ్రెసివ్ గా రెచ్చిపోయాడు అలానే దుమ్మురేపాడు. 38 బాల్స్ లోనే 8 ఫోర్లు 6 సిక్సర్లతో 80 పరుగులు చేసిన అలెన్ ను అక్షర పటేల్ అవుట్ చేయటంతో మ్యాచ్ టర్న్ అయిపోయింది.  రచిన్ 30, మిచెల్ 26, ఇష్ సోది 33పరుగులు చేయటంతో న్యూజిలాండ్ ఇంకో రెండో బాల్స్ ఉండగానే 225పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకు ముందు త్రివేండ్రం పిచ్ మీద బ్యాటింగ్ చేసిన టీమిండియా కు ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దుమ్మురేపే స్కోరును అందించారు. సూర్య కుమార్ 30 బాల్స్ లో 63పరుగులు చేస్తే..చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్ మాత్రం 43 బాల్స్ లో 10 సిక్సులు 6 ఫోర్లతో 103 పరుగులు చేసి కెరీర్ లో తొలి సెంచరీ బాదేశాడు. పాండ్యా చివర్లో 17 బాల్స్ లోనే 42 పరుగులు చేయటంతో భారత్ ఏకంగా 271 పరుగులు చేసి కివీస్ కి భారీ టార్గెట్ ను పెట్టింది. మొత్తంగా 46పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయంతో న్యూజిలాండ్ మీద టీ20 సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. టీ20 వరల్డ్ కప్ కి ముందు ఇది బిగ్ బూస్టప్ అని చెప్పుకోవాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola