Sanju Samson Failure NZ T20 Series | కివీస్ సిరీస్ లో ఘోరంగా ఫెయిలైన సంజూ శాంసన్ | ABP Desam

Continues below advertisement

 జస్టిస్ బాబు...జస్టిస్ బాబు అని పిలుచుకోవాలమో అని సంజూ శాంసన్ ని ఇకపై. ఛాన్స్ ఇవ్వకపోతే దేశమంతా ఏకమై సంజూ శాంసన్ కోసం పోరాడింది. ఆ ప్రిన్స్ గిల్ ఫామ్ లో లేకపోయినా భరిస్తున్నారు మా వాడు 10 మ్యాచుల్లో రెండు సెంచరీలు కొట్టాడు అయినా ఛాన్స్ ఇవ్వట్లేదు అని అభిమానులు చేసిన పోరాటం సెగగా మారి బీసీసీఐకి తగలిందే చేసేది లేక టీ20 వరల్డ్ కప్ కి గిల్ ని పక్కన పెట్టి మరీ సంజూ శాంసన్ ను సెలెక్ట్ చేసింది. పైగా అప్పుడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ మాట అన్నాడు సంజూ శాంసన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్ అని. అయితే వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఇప్పుడు ఈ మాటకు వ్యాల్యూ లేకుండా చేసేసింది అని చెప్పాలి. ఎందుకంటే మన జస్టిస్ బాబు సంజూ శాంసన్..ఈ సిరీస్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 
న్యూజిలాండ్ తో జరిగిన ఐదు  T 20 ల సీరిస్ లో సంజుశాంసన్ స్కోర్ లు  10,6,0, 24,6. ఒక్క మ్యాచ్ లోనూ కనీసం 30 పరుగుల స్కోర్ అందుకోలేకపోయాడు. టీ20 లో వరల్డ్ కప్ లో ఫైనల్ ఎలెవన్ బెర్త్ ప్లేస్ కోసం ట్రై చేస్తున్న ఇషాన్ కిషన్ ఈ సిరీస్ ను విచ్చలవిడిగా వాడేసుకున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీ..ఓ సెంచరీ అంటూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా కుమ్మిపారేశాడు. మరో వైపు సూర్య, అభిషేక్, దూబే, రింకూ అంతా తమ ఫామ్ ను చాటుకున్నారు. ఇప్పుడు మిగిలిందే ఒక్కటే లెక్క. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ కోలుకుని టీ20 వరల్డ్ కప్ కి సెట్ అయ్యాడా సంజూ శాంసన్ ప్లేస్ గల్లంతైనట్లే లెక్క. ఇక మన చటా జస్టిస్ బాబు ఐపీఎల్ లో సీఎస్కేకి ఆడుకుని ప్రూవ్ చేసుకోవటమే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola