Washington Sundar T20 World Cup | గాయం నుంచి కోలుకుంటున్న సుందర్

మరికొద్ది రోజులో టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. కానీ టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ ( Tilak Verma ) గాయం కారణంగానే న్యూజిలాండ్ తో టీ20కు దూరమైయ్యాడు. ప్రపంచ కప్ లో ఆడడానికి తిలక్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. న్యూజిలాండ్ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ముంబైలో టీమ్ తో కలిసే అవకాశం ఉంది. 

ప్రపంచకప్ కంటే ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇంతవరకు వైద్య బృందం నుంచి క్లియరెన్స్ రాలేదు. మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ సైడ్ స్ట్రెయిన్‌కు గురయ్యాడు. ఆలా నాలుగు టీ20 మ్యాచులను ఆడలేదు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు ముందే సుందర్ కోలుకునట్టుగా తెలుస్తుంది. అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు సుందర్ అందుబాటులోకి రావడంపై ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ కోలుకోకపోతే తన స్థానంలో రియాన్ పరాగ్‌ను రీప్లేస్మెంట్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola