Medaram Koya Adivasi Nruthyalu | మేడారం జాతరలో పాల్గొన్న కోయ ఆదివాసీలు ఏం అంటున్నారంటే.! | ABP Desam

మేడారం సమ్మక్క సారక్క జాతరలో కోయ ఆదివాసీల సంప్రదాయాలు ఆచారాలు అందరికన్న భిన్నంగా ఉన్నాయి. కోయ ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో ఆకట్టుకునే సన్నివేశాలతో సమ్మక్క సారలమ్మ లను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ సాంప్రదాయ నృత్యాలు చేస్తు అందరిని ఆకట్టుకుంటున్నారు. జాతరలో ప్రత్యేకంగా మ్యూజియంలోనూ నృత్య ప్రదర్శన చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో గిరిజన కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన గిరిజన కళాకారులు తమ ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన చేశారు. మేడారంలోనీ మ్యూజియం ప్రాంగణంలో అటు జాతరలోను సమ్మక్క సారలమ్మ గుడి ప్రాంగణంలోను ఒక వరుసలో ఒక్కొక్కరిగా తమ తమ ఆచార కట్టుబాట్లతో సాంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తు అందరిని ఆకట్టుకునేలా నృత్య ప్రదర్శన చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనను ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ కోయ ఆదివాసీలు సమ్మక్క సారలమ్మ లను ఏవిధంగా కొలుస్తారు..? కోయ ఆదివాసీల సంప్రదాయాలు ఆచారాలు ఏవిధంగా ఉన్నాయి..? కోయ ఆదివాసీల ఇంటి దైవాల పేర్లేంటి..? కోయ ఆదివాసీల డోలు, కొమ్ము వాయిద్యం ఎలా వాయిస్తారు. ..?  కోయ ఆదివాసీలతో ABP దేశం ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola