Ambati Rambabu Arrest | మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam

 సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా గోరంట్లలో ఫ్లెక్సీ తొలగింపు దగ్గర మొదలైన వివాదం చినికి చినికి గాలి వానలా మారి తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేస్తానంటూ వెళ్లిన అంబటిని కర్రలు చూపిస్తూ కూటమి నాయకులు అడ్డుకోగా...సహనం కోల్పోయిన అంబటి నోటి దురుసు చూపించారు. సీఎం చంద్రబాబును దుర్భాషలు ఆడుతూ అంబటి చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సాయంత్రం నుంచే అంబటి ఇంటి వద్ద హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. కర్రలు, రాళ్లు, కోడిగుడ్లతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు అంబటి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్లు పగులగొట్టి, కిటీకీ అద్దాలను, ఆఫీసును ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో వజ్రవాహనాన్ని తెప్పించిన పోలీసులు రాత్రి 11గంటల సమయంలో అంబటి  రాంబాబును అత్యంత భద్రత మధ్య అరెస్ట్ చేసి నల్లపాడు పీఎస్ కు తరలించారు. అంబటిని అరెస్ట్ చేసే సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లు విసురుతున్నా పోలీసులు అంబటి రాంబాబుకు ప్రొటెక్షన్ ను ఇచ్చి అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంబటిరాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలు, నేతలు కేసులు పెట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola