తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు.. కూతుర్ని పారిపోయేలే చేసింది | ABP Desam
Bangladesh Protest Explained in Telugu | Top 5 Reasons |
చూస్తున్నారుగా..! బంగ్లాదేశ్ ఎలా మారిపోయిందో..! దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్లు..! ఓ దేశ ప్రధాని పారిపోయేలా చేసింది ఈ రిజర్వేషన్లు. అసలేంటీ ఈ రిజర్వేషన్ల గోల..? అర్థం కావాలంటే.. మనమంతా 1947కు వెళ్లాలి..! 1947లో భారత్ రెండు ముక్కలుగా విడిపోయింది. ప్రస్తుతమున్న బంగ్లాదేశ్ ను అప్పట్లో ఈస్ట్ పాకిస్థాన్ , ఇప్పుడున్న పాకిస్థాన్ ను వెస్ట్ పాకిస్థాన్ అనే వాళ్లు. ఈ రెండింటిని కలిపి ఒక దేశంగా ప్రకటించారు. ఐతే... ఈ రెండు దేశాల మధ్య దూరం 2వేల 2వందల 4 కిలోమీటర్లు..! ప్రతి 50 కిలోమీటర్లకే యాస, భాష, సంస్కృతి మారిపోతుంది. మరి.. ఇన్ని కిలోమీటర్లు అంటే ఇంకా ఎన్నో అంతరాలు..! దీంతో..1971లో పాకిస్థాన్ నుంచి ఈస్ట్ పాకిస్థాన్ విడిపోయి... బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా అవతరించింది. ఐతే..1947లో బ్రిటీష్ నుంచి స్వాతంత్య్రం పొంది..25 ఏళ్లకే పాకిస్థాన్ నుంచి స్వాత్రంత్ర్యం పొందడం అంటే మాటలు కాదు. అందుకే.. 1971 ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్న వారికి విద్య, ఉపాధి అవకాశాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 1972లో అప్పటి ప్రధాని షేక్ ముజిబర్ రెహ్మాన్ ఆదేశాలిచ్చారు. ఈయన ఎవరో కాదు.. నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హాసినా తండ్రి..!