కుప్పం కుర్రాడి వినూత్న నివాళి
సిరివెన్నెల సీతారామశాస్త్రికి తనదైన శైలిలో నివాళులర్పించారు కుప్పంకు చేందిన పురుషోత్తం అనే యువకుడు.. ఇంతకు మునుపు పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న పురుషోత్తం రియల్ హీరోగా పేరుగాంచిన సినీ నటుడు సోను సూద్ ద్వారా కరోనా బాధితుడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందించారు. ఎప్పటికప్పుడు తనదైన శైలితో సెలబ్రెటీల చిత్రాలను సాల్ట్ ఆర్ట్ ద్వారా ప్రజలకు కనువిందు కలిగిస్తుంటారు. ఇప్పటికే పురుషోత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, సచిన్ టెండూల్కర్ చిత్తాలను సాల్ట్ ఆర్ట్ ద్వారా చిత్రించారు.. సిరి వెన్నల సీతారామశాస్త్రి చిత్రాన్ని ఇదే సాల్ట్ ఆర్ట్ ద్వారా తన నైపుణ్యంతో చిత్రించి నివాళులర్పించాడు..





















