అన్వేషించండి
YCP Leaders Atrocity: మద్యం మత్తులో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు | Vizag | ABP Desam
Visakhapatnam జిల్లాలో మద్యం మత్తులో Police పై YCP నాయకులు వీరంగం సృష్టించారు. పోలీసు జీప్ వద్ద మద్యం బాటిల్ పగులగొట్టి వాహనం సీటుపై బిర్యానీ పెట్టారు. ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకవరపాలెంలోని ఓ రెస్టారెంట్ లో మద్యం మత్తులో వివాదం చెలరేగింది. యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేయగా... వారు అక్కడికి వచ్చారు. అయినా వైసీపీ నాయకులు ఆగకుండా చెలరేగిపోయారు. అధికారపార్టీ నేతలం, MLA తెలుసు, ఏం చేయలేరంటూ పోలీసులపైనే తిరగబడ్డారు. ఇందులో ఒకరు YCP MPTC భర్త, మరొకరు విద్యాకమిటీ ఛైర్మన్.
వ్యూ మోర్





















