Tirumala: అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు
తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిముద్దయిపోతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యి చెరువును తలపిస్తున్నాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి సిబ్బంది.. మరోవైపు తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో, మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది టిటిడి విజిలెన్స్.





















