Sixth Leopard Caught In Tirumala Alipiri Footpath: చిరుత అయితే మాత్రం..? డోన్ట్ కేర్ అంటున్న శునకం
తిరుమలలో ఆరో చిరుతను అధికారులు బంధించారు. పాప లక్షిత మరణం తర్వాత ఇది ఐదోది కాగా, అంతకముందు పట్టుకున్న మరో చిరుతతో కలిపి మొత్తం ఆరోది. 2850 మెట్టు వద్ద ఇవాళ చిరుత చిక్కింది. ఘటనాస్థలాన్ని టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. అయితే బోనులో ఉన్న చిరుత దెబ్బతిని ఉంది కాబట్టి, కళ్లల్లో ఆ ఫెరోషియస్ నెస్ కనిపిస్తోంది. కళ్లు ఇంతవి చేసి చూస్తోంది. తనను చూస్తున్న అందరిమీదా గాండ్రించింది. బోనులో అటూ ఇటూ ఆగ్రహంగా కదులుతోంది. అయితే ఈ చిరుతను పట్టుకోవడానికి ఓ కుక్కను అధికారులు ఎరగా ఉంచారు. బోనుకు అవతలవైపు ఆ కుక్క కూడా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తోంది. ఆగ్రహంతో గాండ్రిస్తున్న చిరుత అంటే ఏమీ లెక్కే లేనట్టుగా చిరుత చర్మం పట్టుకుని దాన్ని పీకుతోంది. ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





















