Venkateshwar Rao Suspended: రేవ్ పార్టీలో చిందులు... సీఐపై వేటు
పుట్టినరోజు వేడుకల్లో యువతులతో అసభ్య నృత్యాలు చేసిన గుంటూరు సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వరరావుపై వేటు పడింది. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు అనే రెస్టారెంట్‌లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే ఈ పార్టీలో మద్యం సేవించడం, విజయవాడ నుంచి వచ్చిన ఆరుగురు యువతులతో అసభ్యకర డాన్సులు కూడా చేశారు. ఈ పార్టీకి గుంటూరు అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఆరుగురు యువతులు, 19 మంది యువకులతో రేవ్‌పార్టీ జరిగింది. ఈ పార్టీలో అసభ్యకరంగా నృత్యాలు చేసిన ఓ వీడియోలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.





















