AP Capital Row: అమరావతి ఉద్యమం 600వ రోజు... రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత
రాజధాని అమరావతి పోలీసులు వలయంలో ఉంది. అమరావతి ఉద్యమం నేటితో 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలు, ర్యాలీకి పిలుపునిచ్చింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే పంపిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను సైతం అనుమతించడం లేదు. నిరసన కారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.





















