Amit Shah Warning To Tamilisai Soundararajan | తమిళిసైని హెచ్చరించిన అమిత్ షా... అసలేం జరిగింది..?
చూశారు కదా..! కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాజీ గవర్నర్ తమిళిసైతో ఏదో సీరియస్ గా చెబుతున్నారు. ఇంకాస్త గమనిస్తే... ఏదో విషయంపై అమిత్ షా తమిళిసైకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది కదా..! అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..!
ఈ రోజు చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలంతా వచ్చారు. ఆ సమయంలో వారిని పలుకరిస్తూ తమిళిసై వెళ్తున్నారు. ఆమెను పిలిపించుకుని మరి అమిత్ షా ఇలా సీరియస్ చెప్పారు. వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ గవర్నర్ పదవి తరువాత తమిళిసై మళ్లీ యాక్టీవ్ రాజకీయాల్లోకి వచ్చి చెన్నై సెంట్రల్ సీటు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఐతే.. తమిళనాడు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. సో.. ఎన్నికల అనంతరం..తమిళి సై పలు సందర్భాల్లో ఓటమికి గల కారణాలను ఎత్తి చూపుతూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని టార్గెట్ చేశారట. AIDMKతో పొత్తు పెట్టుకుని ఉండుంటే 30కిపైగా సీట్లు సాధించేవాళ్లమని.. ద్రవిడ సెంటిమెంట్ పై రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనవసర కామెంట్లు చేసిందని ఆమె అన్నారు. అన్నామలైని బద్నాం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి. అన్నామలై రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకే.. తమిళనాడులో తొలిసారిగా డబుల్ డిజిట్ ఓటింగ్ పర్సెంటేజ్ బీజేపీ సాధించింది. దీనిపై..మోదీ, అమిత్ షా సంతోషంగా ఉన్నారు. కానీ, తమిళిసై మాత్రం అన్నామలైపై బహిరంగంగా కామెంట్స్ చేయడం దిల్లీ పెద్దలకు నచ్చలేదు. అందుకే... అది బీజేపీ కార్యక్రమం కాకపోయినా... తమిళనాడు కాదు దిల్లీ కాదు.. ఏపీ లో కార్యక్రమం జరుగుతున్నప్పటికీ.. అమిత్ షా అవేవి పట్టించుకోకుండా తమిళిసైకి చిన్నపాటి హెచ్చరిక ఇచ్చారు. బహిరంగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని తిట్టడం సరికాదని సూచించారట. తమిళిసై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అమిత్ షా వినలేదు. దీంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నామలై గురించే అమిత్ షా తమిళిసైతో మాట్లాడి ఉంటారని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు.