(Source: ECI/ABP News/ABP Majha)
Kerala లో దొరికే ఈ రాంబూటన్ ప్రూట్ గురించి వింటే ఆశ్చర్యపోతారు.
కేరళలో ఈ Rambutan అనే ఫ్రూట్ చాలా డిఫరెంట్. చూడ్డానికి చుట్టూ మెత్తటి ముళ్లతో, Thick Red కలర్ లో ఉంటుంది. పైన తొక్క తీస్తే లోపల సాఫ్ట్ గా ఉండే, మనం తినగలిగే గుజ్జుతో ఉన్న ఫ్రూట్ ఉంటుంది. ఇంగ్లీష్ లో ఈ Rambutan ఫ్రూట్ ని హెయిరీ లిచ్చీ (Hairy Lychee) అంటారు. కానీ ఇది మనదగ్గర దొరికే లిచ్చి పండు కాందు. ఇండొనేసియా, మలేసియా, థాయ్ లాండ్ దేశాల్లో Rambutan ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్లేసెస్ లో మాత్రమే ఇది దొరుకుతుంది. రాంబుటాన్ చెట్లు బాగా పెరగాలంటే వెదర్ కండీషన్స్ కొంచెం కూల్ గా ఉండాలి. గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ పెరుగుతాయి. ఇండియాలో కొన్నేళ్ల నుంచి మాత్రమే కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ రాంబూటన్ సాగు మొదలైనది. ఇక్కడ కూడా చాలా రేర్ గా పంట సాగు చేస్తున్నారు. ఈ పంట పండే ప్రాంతాల్లో వర్షపాతం 200 సెంటీమీటర్లకు పైగా ఉండాలి. అందుకే కేరళలో ఇంటికో చెట్టు ఉంటుంది.
రాంబూటన్ చెట్లు సుమారు 12 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుండి మొలకెత్తిన చెట్లు సుమారు 6 - 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. ఇందులోనే కాస్త డిఫరెంట్ గా ఉండే రకాలు మాత్రం 3 లేదా 4 సంవత్సరాల్లోనే కాపుకొస్తాయి. కాచిన కాయలు పక్వానికి రావడానికి 4 - 5 నెలలు పడుతుంది. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మెట్టప్రాంతాలు కూడా రాంబూటన్ సాగు అనుకూలం అని అంటారు.