Puneeth Rajkumar Satellite : పునీత్ రాజ్ కుమార్ కోసం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం! | ABP Desam
బతికున్నప్పుడు పదిమందితో వీడిది ఏం బతుకురా అనిపించుకోవటం కాదు..మనం పోయిన తర్వాత నలుగురితోనైనా ఏం బతికాడు రా అనిపించుకుంటే ఈ జీవితానికి ఓ అర్థం..పరమార్థం ఉన్నట్లే. దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లైఫ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆయన ఈ లోకం విడిచి ఏడాది గడిచినా నేటికీ ప్రజలు ఏదో రకంగా తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న కన్నడ ప్రజలైతే మరే హీరోకు దక్కని స్థాయిలో ఆయన మనతో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన కర్ణాటక రత్న పునీత్ సేవలకు అందించిన గౌరవం అయితే ఇప్పుడు ఆ ఖ్యాతి మరింత పెరగనుంది. కారణం పునీత్ రాజ్ కుమార్ పేరు ఆకాశాన్ని తాకనుంది.






















