News
News
X

Dating With Six Men: ‘డేటింగ్’ ఈమెకు జుజుబీ, ఆరుగురితో ఒకరికి తెలియకుండా మరొకరితో రొమాన్స్, చివరికి..

ఒక్క లవర్‌‌కు సమయం కేటాయించాలంటేనే 24 గంటలు సరిపోవు. అలాంటిది ఆమె ఒకేసారి ఆరుగురితో.. ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ చేసింది. చివరికి ఇలా దొరికిపోయింది.

FOLLOW US: 

క హీరో, ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండే సినిమాలు తెలుగులో చాలానే చూసి ఉంటారు. అందులో హీరో ప్రియురాళ్ల నుంచి తప్పించుకోడానికి ఎన్నో ఎత్తులు వేస్తాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తూ.. సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సీన్స్ చూసేందుకు చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ, నిజ జీవితంలో అలాంటి పనులు దినదిన గండంలా ఉంటాయి. ఏదో ఒక రోజు నిజం బయటపడకపోదు. ఈ యువతి విషయంలో కూడా అదే జరిగింది. అయితే, ఈమె ఇద్దరు ముగ్గరితో సరిపెట్టుకోలేదు. ఒకేసారి ఆరుగురితో డేటింగ్ చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరిని కలుస్తూ.. వారి వద్ద మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు, ఖరీదైన గిఫ్టులు కొనిపించుకుంటూ జల్సాలు చేసింది. చివరికి దొరికిపోయింది. 

చైనాకు చెందిన మావో అనే 42 ఏళ్ల మహిళ.. ఇటీవల వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మారింది. డేటింగ్ కోసం ఆరాపడుతున్న ఆరుగురు పురుషులు ఆమెకు బంగారు బాతుల్లా చిక్కారు. ఇంకేముంది వారిని మాటల్లో పెట్టి డేటింగ్ మొదలెట్టింది. ఒకరికి తెలియకుండా ఒకరితో డేటింగ్ చేస్తూ.. ఆరుగురినీ మాయ చేసింది. వారితో క్లోజ్‌గా ఉంటూ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, దుస్తులు కొనిపించుకొనేది. డబ్బులు కూడా భారీగా దండుకొనేది. అయితే, ఆరుగురిలో ఒకరికి ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఎట్టకేలకు ఆమెపై ఓ కన్నేశాడు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. 

స్థానిక మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌లో ఒకరైన యూ అనే వ్యక్తి ఆమె రొమాంటిక్ స్కా్మ్‌ను బయటపెట్టాడు. జేజియాంగ్ ప్రావీన్స్‌లోని యువ్యూ ప్రాంతానికి చెందిన ఓ మహిళను తాను గతేడాది ఆగస్టు నెలలలో ఓ డేటింగ్ సైట్ ద్వారా కలిశానని తెలిపాడు. అందులో ఆమె విడాకులు తీసుకున్నానని, పిల్లలు కూడా లేరని పేర్కొందన్నాడు. తనతో శాస్వతంగా కలిసి ఉండే వ్యక్తి కోసం వెతుకుతున్నానని తెలిపినట్లు యూ వెల్లడించాడు. 

Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!

అతడు ఆమె అందానికి పడిపోయాడు. దీంతో ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. చివరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా యూ.. ఆమె కుటుంబికులను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపేవాడు. కానీ, ఆమె మాత్రం దాన్ని వాయిదా వేయడానికి సాకులు వెతికేది. దీంతో అతడికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు పెళ్లి దుస్తులు కొనుగోలు చేయడానికి, వేదిక ఏర్పాటు కోసం ఆమెకు డబ్బులిచ్చాడు. కానీ, ఆమె మాత్రం ఈవెంట్ ఆలస్యం చేస్తూనేఉంది. దీంతో అతడి అనుమానం మరింత పెద్దదైంది. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో యూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమె అసలు గుట్టు బయటపడింది. ఆమె మరో ఐదుగురితో కూడా డేటింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆరు నెలల వ్యవధిలో ఆమె కనీసం ఆరుగురి నుంచి 150,000 యువాన్(రూ.17,89,167) విలువ చేసే గిఫ్టులు, నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి, మీరు కూడా డేటింగ్ చేసేప్పుడు జాగ్రత్త. 

Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

Published at : 28 Mar 2022 05:15 PM (IST) Tags: Woman Dating With Six Men Dating With Six Men China Woman Dating ఆరుగురితో డేటింగ్

సంబంధిత కథనాలు

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

ఈ బజారులో భర్తను కొనుక్కోవచ్చు, 700 ఏళ్లుగా ఇదే ఆచారం - ఎక్కడో కాదు ఇండియాలోనే!

ఈ బజారులో భర్తను కొనుక్కోవచ్చు, 700 ఏళ్లుగా ఇదే ఆచారం - ఎక్కడో కాదు ఇండియాలోనే!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి రోజున బిడ్డ పుడితేనే రక్షాబంధన్ పండుగ- నేటికీ వేడుక చేసుకోని గ్రామం

Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి రోజున బిడ్డ పుడితేనే రక్షాబంధన్ పండుగ- నేటికీ వేడుక చేసుకోని గ్రామం

పంట పొలాల్లో సిటింగ్ ఎంత ప్రమాదమో తెలుసా?

పంట పొలాల్లో సిటింగ్ ఎంత ప్రమాదమో తెలుసా?

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!