Viral Video: కోచింగ్ సెంటర్‌లో ఐటమ్ సాంగ్‌కి విద్యార్థుల స్టెప్పులు-వైరల్ వీడియో
బిహార్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు భోజ్‌పురి ఐటమ్ సాంగ్‌కి చిందులేశారు.
కోచింగ్ సెంటర్‌లో ఇదేం పని బాబు..
కోచింగ్ సెంటర్‌లో ఏం చేస్తారు..? ఇదేం ప్రశ్న అనుకోకండి. అన్ని కోచింగ్ సెంటర్లు ఒకేలా ఉండవు. బిహార్‌లో జరిగింది తెలుసుకున్నాక మీరు కూడా ఇదే మాట చెబుతారు. గయా జిల్లాలోని కోచింగ్ సెంటర్‌లో ఓ భోజ్‌పురి ఐటమ్ సాంగ్‌కు విద్యార్థులంతా డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ట్విటర్‌లో వైరల్ అవుతోంది. బిహార్ విద్యావ్యవస్థపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు రావటం ఇంకా వివాదాస్పదమవుతోంది. ఇటీవల తరచుగా అక్కడి విద్యావ్యవస్థలోని లోపాలను బయటి ప్రపంచానికి తెలియజేసే ఘటనలు జరుగుతున్నాయి. అందులో ఇదీ ఒకటి. ఈ వీడియోలో విద్యార్థులంతా హుషారుగా ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ ట్యూన్‌కి తగ్గట్టుగా గట్టిగా అరుస్తూ డ్యాన్స్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే...అక్కడే టీచర్ కూడా ఉన్నాడు. విద్యార్థులను వారించాల్సింది పోయి వారితో పాటు కలిసి చిందులేశాడు. ఇంతకీ ఈ కోచింగ్ సెంటర్ పేరేంటో తెలుసా..? వికాస్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎంటర్‌టైన్ చేస్తున్న కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కేవలం రిఫ్రెష్‌మెంట్ కోసం ఇలా చేసుంటారని చెబుతున్నారు.
गया में कोचिंग संस्थान में मिल रहा ज्ञान देखिए. pic.twitter.com/I66aGPtYJ1
— Utkarsh Singh (@UtkarshSingh_) July 21, 2022
कुछ लोगों का कहना है की इसमें ग़लत क्या है? मनोरंजन ज़रूरी है।
— Anurag Kashyap (@ikashyap_) July 21, 2022
मनोरंजन और फूहड़ता में फ़र्क़ होता है।जो गाना आप अपने सगे बहन/माँ/बाप के साथ बैठकर नहीं देख सकते उस गाने को कोई कोचिंग संचालक छात्र/छात्राओं के बीच में कैसे बजा सकता है?
5 मिनट एक गो गाना चल जाई त कवन दिक्कत हो जाई? या तकलीफ भोजपुरी भाषा से ह?
— Kushwaha (@THEINDI87725563) July 21, 2022