Viral News: ఇదే విడ్డూరం రా బాబు.. మగాడికి గర్భాశయం, అండాశయం కూడా ఉందట
Uttar Pradesh News: సాధారణంగా జన్యుపర లోపాలతో స్త్రీ, పురుషుల్లో మార్పులు సంభవిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అవి కొన్నేళ్లకు బయట పడుతుంటాయి. రాజ్ గిరి మిస్త్రీ అనే వ్యక్తి విషయంలో కూడా అదే జరిగింది.
Nationa News : సృష్టిలో ఎన్నో వింతలు, విచిత్రాలు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. సైన్స్ అభివృద్ది చెందిన తర్వాత ఎవరూ ఊహించని సంఘటనలు, సృష్టికి విరుద్ధంగా కూడా కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఓ విచిత్రమైన వార్త ఉత్తరప్రదేశ్ నుంచి వెలుగులోకి వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తనకు హెర్నియా ఉందని ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో తన శరీరం లోపల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజ్ గిరి మిస్త్రీ (46) అనే వ్యక్తికి అప్పటికే పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల అతను తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు అయినా అందుకు ఫలితం కనిపించలేదు.
హెర్నియా ఆపరేషన్
సాధారణంగా జన్యుపర లోపాలతో స్త్రీ, పురుషుల్లో మార్పులు సంభవిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అవి కొన్నేళ్లకు బయట పడుతుంటాయి. రాజ్ గిరి మిస్త్రీ అనే వ్యక్తి విషయంలో కూడా అదే జరిగింది. మిస్త్రీకి కొన్ని రోజులుగా కడుపునొప్పి ఉంది. దాని కారణంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్ సూచన మేరకు అతను అల్ట్రాసౌండ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అల్ట్రాసౌండ్‌లో అతని పొత్తికడుపు దిగువ భాగంలోని మాంసం ఇతర అంతర్గత అవయవాలతో తాకినట్లు కనిపించింది. హెర్నియా ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. అతడి వద్ద తగిన డబ్బులు లేకపోవడంతో హెర్నియా ఆపరేషన్ నిమిత్తం ఉచిత వైద్య శిబిరానికి వెళ్లాడు. అక్కడే అసలు సమస్య ఏంటో తెలిసింది. సర్జరీ చేస్తుండగా పొత్తు కడుపు పొర నుంచి బయటకు చిన్న మాంసపు ముద్ద వచ్చింది. అది చూడడానికి చిన్న గర్భాశయంగా ఉందని వైద్యులు గుర్తించారు. దాని పక్కనే అండాశయం కూడా ఉంది. దానిని చూసి డాక్టర్లు అవాక్కయ్యారు.
గర్భాశయం అండాశయం తొలగింపు
ఆరోగ్య శిబిరంలో బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర దేవ్ మాట్లాడుతూ.. వ్యక్తి అల్ట్రాసౌండ్ రిపోర్టులో హెర్నియా స్పష్టంగా కనిపించింది. రాజ్ గిరి మిస్త్రీకి డాక్టర్ దేవ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. మిస్త్రీకి హెర్నియాతో పాటు గర్భాశయం, అండాశయాన్ని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఆపరేషన్ చేసిన తర్వాత మిస్త్రీ ఆరోగ్యంగా ఉన్నారని బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర దేవ్ తెలిపారు. మిస్త్రీకి ఇది పుట్టుకతో వచ్చిన వైకల్యం అని చెప్పారు. అతనికి ఎలాంటి స్త్రీ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.
గర్భం దాల్చిన పురుషుడు
నాగ్‌పూర్ నివాసి అయిన సంజు భగత్ అనే వ్యక్తి గర్భం దాల్చిన వార్త మనం చదివే ఉన్నాం. సంజు భగత్ చిన్న వయసులో ఎలాంటి వైద్యపరమైన సమస్యలు లేవు. ఇరవై ఏళ్లు వచ్చిన తర్వాత కడుపు వేగంగా ఉబ్బడం మొదలైంది. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. రానురాను సంజుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే స్థాయికి పరిస్థితి చేరింది.1999లో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు సంజు భగత్. అతని కడుపులో కణితి ఉందని వైద్యులు భావించారు. ఆపరేషన్ చేయడంతో వైద్యులు అవాక్కయ్యారు.. వారు సంజు కడుపు నుండి మానవ శరీర భాగాలను, వెంట్రుకలను కూడా ఒక్కొక్కటిగా బయటికి తీశారు.పిండం శస్త్రచికిత్స తర్వాత వెంటనే మరణించింది.