అన్వేషించండి

Pet Dogs: మనిషికి అత్యంత ఆప్త మిత్రులు శున‌కాలే, విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్!

Dogs Day | మ‌నిషికి అత్యంత న‌మ్మ‌క‌మైన జంతువు శున‌కం. చాలా సుల‌భంగా మ‌నిషితో క‌లిసి పోగ‌ల నేర్ప‌రిత‌నం వాటి సొంతం. అలాంటి శున‌కాల కోసం ఆగ‌స్టు 26ను అంత‌ర్జాతీయ శున‌కాల దినోత్స‌వంగా జ‌రుపుకొంటారు.  

International Dogs Day | జంతు జీవాల్లో మనిషికి అత్యంత ఆప్త మిత్రులు, పురాత‌న మిత్రులు శునకాలేన‌ని కుక్కలపై జరిపిన ఒక డీఎన్ఏ అధ్యయనం చెప్తోంది. ఇతర ఏ జంతువులను పెంచుకోక ముందు నుంచే మ‌నిషి కుక్కలను పెంచుకుంటున్నాడు. మనిషి కుక్కలను పెంచడమ‌నేది గత 11,000 సంవత్సరాల నుంచీ జ‌రుగుతున్న‌ది. మంచుయుగం అంతమైనప్పటి నుంచీ శున‌కాలు మ‌న‌కు మిత్రులుగా ఉన్న విష‌య ఈ అధ్యయనంలో వెల్లడైంది.

మ‌నిషికి న‌మ్మ‌క‌మైన ఆప్త‌మిత్రులు శున‌కాలే..

శున‌కాలు మ‌నిషికి అత్యంత న‌మ్మ‌క‌మైన మిత్రులు. విశ్వాసంలో శున‌కాల‌ను మించిన జంతువు లేదనేది అక్ష‌ర స‌త్యం. శున‌కాలు నేటి కాలంలో కాపాలా జంతువుగానే కాకుండా ఇంటి మ‌నిషిగా చెలామ‌ణీ అవుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రాజ‌భోగాలు అనుభ‌విస్తున్న శున‌కాలు అనేకం ఉన్నాయి. ఒంట‌రి జీవితం గ‌డిపే చాలా మంది శున‌కాలను పెంచుకుంటూ ఆనందం పొందుతుంటారు. మ‌నిషికి ఇంత ద‌గ్గ‌ర‌గా మ‌సిలే జంతువు శున‌కం మాత్ర‌మే. పూర్వ‌కాలం నుంచి కూడా వేట‌కు వెళ్లేవారు  త‌మ వెంట ర‌క్ష‌ణ‌గా శున‌కాల‌ను తీసుకెళ్లేవారు. 
పోలీసులకు క్రైం ఇన్వెస్టిగేష‌న్‌లో శున‌కాల పాత్ర గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వాస‌న ప‌సిగ‌ట్ట‌డంలో శున‌కాల‌కున్న గాఢ‌త మ‌రే ఇత‌ర జంతువుకు ఉండ‌దు. అందుకే బాంబుల నిర్వీర్యం కోసం కూడా డాగ్ స్క్వాగ్ పోలీసులు వినియోగిస్తుంటారు. 

మ‌నిషి జీవితాన్ని నిత్యం కాంతివంతంగా మార్చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే శున‌కాల‌కు కూడా ఒక ప్ర‌త్యేకమైన రోజుంది. ఆగ‌స్టు 26ను అంత‌ర్జాతీయ శున‌కాల దినోత్స‌వంగా జ‌రుపుకొంటారు. మ‌నిషి ఎమోష‌న్‌ల‌ను, క‌ష్టాల‌ను అర్థం చేసుకోగల స‌త్తా నేర్ప‌రిత‌నం శున‌కాల సొంతం. అతి త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నుష్యుల‌తో క‌లిసిపోగ‌ల జంతువు ఇది. అలాంటి శున‌కాల‌కు ప్ర‌త్యేకంగా ఒక‌రోజు కేటాయించి పండ‌గ‌లా జ‌రుపుకోవ‌డం వాటి గొప్ప‌త‌నాన్ని గుర్తించ‌డ‌మే. 

ఎలా మొద‌లైంది...
అంత‌ర్జాతీయ శున‌కాల దినోత్స‌వాన్ని 2004 నుంచి జ‌రుపుకొంటున్నారు. కొల్లీన్ పేజ్ అనే జంతు ప్రేమికురాలు ప్ర‌పంచంలోనే మొద‌టిసారిగా 2004లో శున‌కాల దినోత్స‌వాన్ని మొద‌లుపెట్టారు. `షెల్టీ` అనే శున‌కాన్ని ఆగ‌స్టు 26న కొల్లీన్ పేజ్ త‌న కుటుంబంలోకి తెచ్చుకుంది. అప్ప‌టికి ఆమె వ‌య‌సు కేవ‌లం ప‌ది సంవ‌త్స‌రాలు. ఆ రోజునే న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ అధికారికంగా శున‌కాల దినోత్స‌వంగా ప్ర‌క‌టించింది. శున‌కాల‌ను ప‌రిర‌క్షించ‌డం, వాటి జాతుల‌ను కాపాడ‌టం, జంతు హింస నుంచి ర‌క్ష‌ణతోపాటు శున‌కాల‌ను ద‌త్త‌త ఇచ్చే కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుడుతూ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ నిర్ణ‌యం తీసుకుంది. 

శున‌కాల కోసం అధికారిక వెబ్సైట్‌

శున‌కాల ప‌రిర‌క్ష‌ణ‌తోపాటు వాటి వివ‌రాల‌ను వెల్ల‌డించేలా అధికారికంగా ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో శున‌క జాతులు, వాటి వివ‌రాలు, హింస నుంచి కాపాడ‌బ‌డిన శున‌కాలు, ఎక్క‌డెక్క‌డ శున‌కాల‌ను సంర‌క్షిస్తున్నారు.. విధుల్లో వీరోచితంగా క‌ష్ట‌ప‌డుతున్న శున‌కాల వివ‌రాల‌న్నీ ఈ వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌డం విశేషం. త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ శున‌కాలు య‌జ‌మానుల ప్రాణాల‌ను కాపాడ‌టం చాలా సంఘ‌ట‌న‌ల్లో చూశాం. తిన్న తిండికి విశ్వాసం చూపించి చెప్పిన ప‌నిని చేయ‌డంలో శున‌కాల‌ను మించిన జంతువు ఉండ‌దు. అందుకే ఈ శున‌కాలు మ‌నిషికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌విగా మారిపోయాయి. విశ్వాసం గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు మ‌నిషిని న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా శున‌కాల‌ను గుడ్డిగా న‌మ్మ‌వ‌చ్చ‌ని చెబుతుంటారు. 

Also Read: Viral News: రెంట్ పెంచలేదు, మా ఇంటి ఓన‌ర్ చాలా మంచోడు - ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా!

 

టాప్ హెడ్ లైన్స్

Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Embed widget