అన్వేషించండి

Elephant Crocodile Fight: గున్న ఏనుగును రక్షించుకునేందుకు మొసలితో తల్లి ఏనుగు పోరు

Elephant Crocodile Fight: మొసలి నుండి తన పిల్ల ఏనుగును తల్లి ఏనుగు కాపాడిన వీడియోను సుశాంతా నందా అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీట్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

Elephant Crocodile Fight: గజేంద్ర మోక్షం కథ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరస్సులోకి దిగిన ఏనుగు కాలిని ఓ మొసలి పట్టుకుని నీటిలోకి లాగుతుంది. మొసలి పట్టు నుండి విడిపించుకోలేక ఆ ఏనుగు మహావిష్ణువును ప్రార్థించగా.. విష్ణువు వచ్చి ఆ మొసలి బారి నుండి గజేంద్రుడిని కాపాడతాడు. ఈ ఇతిహాసంలో ఆ ఏనుగు పేరు గజేంద్రుడు కావడం, గజేంద్రుడికి మహావిష్ణువు విడిపించడం వల్ల ఆ కథను గజేంద్ర మోక్షంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి పరిస్థితే తాజాగా ఓ మొసలికి ఎదురైంది. చిన్న నీటి గుంట కనిపించగానే ఆ ఏనుగు మైమరిచిపోయి అందులో జలకాలాటలు ఆడుకుంది. అటు ఇటు దొర్లుతూ ఎండ వేడి నుండి చల్లగా ఎంజాయ్ చేసింది. అంతలోనే ఓ మొసలి ఆ ఏనుగుపై దాడి చేసేందుకు పైకి వచ్చింది. అయితే ఆ ఏనుగు తనను కాపాడాలంటూ ఎవరినీ పిలవలేదు. తనకు పిలిచే అవసరం కూడా లేదు. ఎందుకంటే తనతో మహావిష్ణువు అంతటి తల్లి అండగా ఉంది. తల్లి అండగా ఉంటే ఏ జీవి అయినా ఎందుకు భయపడుతుంది.

తల్లి ప్రేమ, మమకారం, భద్రత మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా ఒకటే. మరీ ముఖ్యంగా ఏనుగులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. తన పిల్లలకు ఆపద వస్తే అంతకంటే ఎక్కువ ఉక్రోశంతో, ఆవేశంతో కనిపిస్తాయి. ఎంతటి జంతువునైనా ఎక్కడైనా ఎదురిస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో గున్న ఏనుగు నీటిలో ఆడుకుంటుండగా.. దానిపై దాడి చేసేందుకు నీటిలో నుండి మొసలి బయటకు వస్తుంది. నీటి ఒడ్డునే ఉండి బుజ్జి ఏనుగు ఆడుకుంటుండాన్ని గమనిస్తున్న ఆ తల్లి ఏనుగు మొసలి అలికిడి వినిపించగానే ఒక్క ఉదుటున ఆ మొసలిపైకి దూకింది. తన కాళ్లతో తొక్కేసింది. తొండంతో పట్టుకునేందుకు ప్రయత్నించింది. నా బిడ్డపైనే దాడికి వస్తావా అనుకుంటూ ఘీంకరిస్తూ తన కోపాన్ని ఆ మొసలిపై చూపించింది. ఆ తల్లి ఏనుగు దాడితో కన్ను లొట్ట పడి ఆ మొసలి కుయ్యో మొర్రో అనుకుంటా అక్కడి నుండి తప్పించుకుని పారిపోయింది. 

బుజ్జి ఏనుగులను పెద్ద ఏనుగులు ఎలా రక్షించుకుంటాయి?

సుశాంత నందా అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ' ఏనుగులు తన గున్న ఏనుగులను రక్షించుకునేందుకు ఏం చేస్తాయి, ఎంత వరకు వెళ్తాయని తెలుసుకునేందుకు ఇదో చిన్న సంఘటన. తల్లి ప్రేమ ముందు మొసలి లొంగిపోయింది' అంటూ రాసుకొచ్చాడు ఆ ఆఫీసర్. ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అమ్మ ఎప్పటికీ అమ్మే. అది మనిషి అయినా జంతువు అయినా ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదంటూ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు. గ్రేట్ మమ్మీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఓ తల్లి తన పిల్లను కాపాడుకోవడంలో విజయవంతమైందని మరొకరు కామెంట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Embed widget