అన్వేషించండి

YS sharmila: జగన్, షర్మిల మాట్లాడుకుంటున్నారా? ప్రెస్ మీట్ లో మాటలకు అర్థమేంటి?

జగన్, షర్మిల మధ్య వివాదాలూ ఏమీ లేవా? ఒకవేళ ఉన్నా.. ప్రస్తుతం సద్దుమణిగిపోయాయా? పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి మీడియా ముందు మాట్లాడిన షర్మిల మాటలు చూస్తుంటే ఏమనిపిస్తోంది..

ఏపీ సీఎం జగన్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు విబేధాలు సద్దుమణిగాయా? వారిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అన్నాచెల్లెలు మధ్య వివాదాల కారణంగానే  తెలంగాణలో పార్టీ పెట్టిందన్న మాటలు పుకార్లేనా?  

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించిన తర్వాత.. తొలిసారి మీడియా ముందు మాట్లాడారు షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని తెలిపారు. ఏపీ సీఎం జగన్​ మీద అలిగితే.. మాట్లాడ్డం మానేస్తాను కానీ పార్టీ పెట్టనని చెప్పారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోందన్న ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా పార్టీ పెట్టినట్లు తెలిపారు. అంటే తన అన్న జగన్ పాలన బాగుందని షర్మిల చెప్పకనే చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

 'సీఎం జగన్ మీద అలిగితే మాట్లాడం మానేస్తా.. పార్టీ పెట్టను. పార్టీ అంటే వ్యక్తి కాదు.. ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. నేను ఒంటరినని భయపడను, బాధలేదు. ఇది ప్రజల పార్టీ. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పరిస్థితులు లేవు.. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పార్టీ పెట్టాను. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది. నేను ప్రభంజనం సృష్టిస్తా.. రాసి పెట్టుకోండి.  రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. కేసీఆర్ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు.' అని వైఎస్ షర్మిల మాట్లాడారు.

ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరని వ్యాఖ్యానించారు. తెరాసలో మహిళలకు గౌరవం ఉండదని విమర్శించారు. మహిళలంటే వ్రతాలే చేసుకోవాలని కేటీఆర్ అంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాను వ్రతమే చేస్తున్నానని అన్నారు.

వైఎస్ లాగే తానూ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల చెప్పారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని.. సీఎం అయ్యాక కేసీఆర్‌లోని దొర బయటికొచ్చారని విమర్శించారు.

సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని షర్మిల అన్నారు. తెలంగాణ అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది వైఎస్సేనని చెప్పారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని పేర్కొన్నారు.

పగ, ప్రతీకారం కోసమే హుజూరాబాద్ ఉపఎన్నిక అని షర్మిల అన్నారు. కేసీఆర్ పాలనలో జనం ఇబ్బందులు చూడలేకే పార్టీ పెట్టానని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ విఫలమయ్యారని అన్నారు. ఆయన తనకొచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు అర్థమే లేదన్న షర్మిల.. పగలు, ప్రతీకారాల కోసం హుజూరాబాద్ ఉపఎన్నికను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Ponnam Prabhakar On SIR: ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
ఓటు కోల్పోయిన వారిని తీసుకొస్తా, డేట్ ఫిక్స్ చెయ్- రాంచందర్‌రావుకు మంత్రి పొన్నం ఛాలెంజ్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget