అన్వేషించండి

Somesh What Next : ఏపీలో రిటైర్ అవ్వాలా ? వీఆర్ఎస్ తీసుకోవాలా ? డైలమాలో సోమేష్ కుమార్ !

సోమేష్ కుమార్ ఏపీ సర్వీసులో చేరుతారా ? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా ?

 

Somesh What Next : మంగళవారం ఉదయం వరకూ సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ. కానీ గంటల్లో మారిపోయిన పరిస్థితుల కారణంగా సాయంత్రానికి ఆయన పదవి పోయింది. అసలు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్ కు మారిపోయారు.ఇప్పుడు తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ కూడా వచ్చేశారు. ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  అప్పీల్‌కు కూడా చాన్స్ లేకుండా సాయంత్రానికి ఆయనకు ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చేశాయి. పన్నెండో తేదీ అంటే గురువారమే ఏపీలో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు రిలీజ్ చేసేసింది.  హడావుడిగా వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమైనా ప్రయోజనం  లేకపోయింది. ఇప్పుడు ఆయన ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి వెళ్లి ఏపీ సర్వీసులో చేరిపోవడం.. రెండు వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంలోనే సలహాదారుగా చేరిపోవడం. 

వీఆర్ఎస్ తీసుకోవాలన్నా ముందు వెళ్లి ఏపీ క్యాడర్‌లో చేరాల్సి ఉంటుంది. అందుకే సోమేష్ కుమార్ డీవోపీటీ  ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం అమరావతి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. సచివాలయానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో సమావశం అవుతారని.. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ తో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందుగా రిపోర్ట్ చేయడం తప్పని సరి.. ఆయన సీఎస్‌కు రిపోర్ట్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం  పోస్టింగ్ ఇస్తుంది. ప్రస్తుతం సీఎస్ స్థాయిలో పని చేసినందున..  ఏపీలో ఏ పోస్టు ఇచ్చినా ఆయన సర్దుకోవడం కష్టమే. అలాగని ఆయనకు చీఫ్ సెక్రటరీ పోస్టును ఏపీలో కేటాయించే అవకాశం లేదు. 

సోమేష్ కుమార్ కు ఇంకా పదకొండు నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. ఈ పదకొండు నెలలు ఏదో ఓ లూప్ లైన్ పోస్టులో కొనసాగి రిటైర్ అయిపోవడం మంచిదన్న ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన ఏపీ సర్వీస్ లో చేరి వెంటనే వాలంటరీ రీటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనను తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ .. సలహాదారుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. పదకొండు నెలల సర్వీస్ వదులుకుని సలహాదారుగా చేరిపోవాలా వద్దా అనే ఆలోచన సోమేష్ కుమార్ చేస్తున్నారు. సలహాదారు పదవి తీసుకున్నా.. అది ఆయనకు ఎంత కాలం సర్వీస్ ఉందే అంతే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నవంబర్, డిసెంబర్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం  మారినా.. మారకపోయినా ఆయనకు పదవి ఉంటుందని చెప్పడం కష్టం. 
 
సీఎస్ సోమేష్ కుమార్ విషయలో తెలంగాణలో అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన తీసుకున్న  అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ధరణి అంశం ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది. సోమేష్ రెండు సార్లు సర్వీస్ నుంచి  లాంగ్ లీవ్ తీసుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  అయినప్పటికీ ఆయన కంటే ఎనిమిది మంది సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ ఆయనకు సీఎస్ పోస్టు ఇచ్చారు. ఏపీలో ఎలాంటి పోస్టులో చేరినా అది తన స్థాయికి చిన్నదే కాబట్టి..  ఐఏఎస్ సర్వీస్ కు రాజీనామా చేయాలని అనుకుంటున్న ట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Embed widget