అన్వేషించండి

Telangana Municipal Elections Results 2026: హంగ్ మున్సిపాలిటీల్లో ఎవరికి అడ్వాంటేజ్? స్వతంత్రులు అధికార పార్టీకే జై కొడతారా?

Municipal Elections Results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ మున్సిపాలిటీలపై అందరి చూపు పడింది. స్వతంత్రులు ఎవరివైపు మొగ్గితే వారికే పీఠాలు దక్కనున్నాయి.

Will independents vote for the ruling party: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సరికొత్త మలుపు తిప్పాయి. దాదాపు  30కు పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో హంగ్ ఏర్పడినప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ఆ పీఠాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజాతీర్పులో అనిశ్చితి కనిపించిన చోట కూడా రాజకీయ చదరంగంలో పైచేయి సాధించి, మున్సిపల్ కోటలపై తన జెండాను ఎగురవేయడానికి హస్తం పార్టీ సిద్ధమైంది.

అధికార పార్టీ వైపే ఇండిపెండెంట్లు

ఈ రాజకీయ అనిశ్చితిలో స్వతంత్ర అభ్యర్థులే  నిర్ణయాత్మక శక్తి మారారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గెలిచిన స్వతంత్రులలో అత్యధికులు కాంగ్రెస్ రెబల్స్ కావడమే ఆ పార్టీకి పెద్ద ఊరటనిస్తోంది. టికెట్ రాలేదన్న అసంతృప్తితో బరిలోకి దిగి గెలిచిన వీరంతా, ఇప్పుడు తిరిగి తమ సొంత గూటికి చేరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో హంగ్ ఏర్పడిన మెజారిటీ పురపాలికలు అధికార పార్టీ ఖాతాలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్స్ అఫీషియో ఓట్లు అదనం 

మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచిన చోట్ల కాంగ్రెస్ తన అత్యంత బలమైన  ఎక్స్-అఫీషియో ఓట్ల అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఎంపీలకు ఉండే ఈ ఓటు హక్కు, హంగ్ మున్సిపాలిటీల్లో ఫలితాన్ని తారుమారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రతినిధులే ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. ఇప్పటికే గెలిచిన స్థానాలకు తోడు, స్వతంత్రుల మద్దతు , ఎక్స్-అఫీషియో ఓట్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100కు పైగా మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ పీఠాలను దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.                             

కొన్ని ఫిరాయింపులు కూడా ఉండొచ్చు ! 

క్షేత్రస్థాయిలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే వార్డుల అభివృద్ధికి నిధులు రావడం కష్టమనే భావన వారిలో బలంగా ఉంది.  అధికార పార్టీతో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే సూత్రాన్ని నమ్ముతున్న స్వతంత్రులు, ప్రభుత్వానికి మద్దతు తెలపడం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇదే సూత్రంతో కొన్ని ఫిరాయింపులు ఉండవని కూడా అనుకోలేం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది.

ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్పటి వరకు గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం , స్వతంత్రులను సమన్వయం చేసుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఫలితాల్లో హంగ్ కనిపించినా, అంతిమంగా అధికార బలంతో మున్సిపల్ పాలనపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించే దిశగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.                        

టాప్ హెడ్ లైన్స్

Pratibha Thakkadpally: క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
క్రీడాశాఖపై ఆరోపణలు చేసిన ప్రతిభ తకడపల్లి ఎవరు? సాధించిన విజయాలేంటీ? వచ్చిన పతకాలు ఎన్ని?
Breaking News: శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
శ్రీశైలంలోని సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Ration Card Credit Politics: రేషన్ కార్డులపై ఫొటో రాజకీయం - బియ్యం ఇచ్చేది ఎవరు? మైలేజ్ కోరేది ఎవరు?
రేషన్ కార్డులపై ఫొటో రాజకీయం - బియ్యం ఇచ్చేది ఎవరు? మైలేజ్ కోరేది ఎవరు?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Pratibha Takadapally:
"పతకాలు సాధించినప్పుడు ఏమైపోయారు? క్రీడామంత్రిత్వ శాఖ బెదిరింపులు నిజం" ప్రతిభా తకడపల్లి హాట్‌కామెంట్స్
Irumudi Collection: వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
వంద కోట్ల క్లబ్బులో 'ఇరుముడి'... బాహుబలి తర్వాత ఆ రికార్డు రవితేజ సినిమాదే
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?
Embed widget