Weather Updates: ఏపీకి మరో 3 రోజులు వర్షాలే.. ఈ జిల్లాల వారికి అలర్ట్, తెలంగాణలో వానలు ఈ ప్రాంతాల్లో..
సెప్టెంబరు 2న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం సూచించింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో బుధవారం (సెప్టెంబరు 2న) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే, వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏం లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బుధవారం (సెప్టెంబరు 2న) రాత్రి సమయంలో హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే సెప్టెంబరు 2న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షప్రభావం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 2న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్ద పల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట సహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఏర్పడినట్లుగా వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కూడా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.